Advertisement

మీ శరీర ఆరోగ్యాన్ని తెలిపే నాలుక

By: chandrasekar Wed, 12 Aug 2020 2:28 PM

మీ శరీర ఆరోగ్యాన్ని తెలిపే నాలుక


మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేసే చిట్కా నాలుకని చూడడం. నాడి పట్టి ఆరోగాన్ని ఎలా చెప్తారో, నాలుకను చూసి కూడా మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం డాక్టర్లకు తెలిసిన విషయం. మీరు కూడా నాలుకను చూసి మీ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. మీ నాలుక రంగు మీ ఆరోగ్యం గురించి చెబుతుంది. నాలుకను చూడటం ద్వారా ఆరోగ్యం గురించి ప్రాథమికంగా ఓ అంచనాకు రావచ్చు.

* ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో ఉంటుంది. తేమగా, మృదువుగా ఉంటుంది.

నాలుక ఊదా రంగులో ఉంటే రక్త ప్రసరణ లోపాలు ఉన్నాయని తెలుసుకోవాలి.

* నాలుక పాలిపోయి తెల్లగా కనిపిస్తుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి తక్కువగా ఉందని అర్థం. ఐరన్, ప్రొటీన్ల లోపాన్నీ తెలియచేస్తుంది. మీ నాలుక ఇలా కనిపిస్తే పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

* శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాలుక ఊదా రంగులోకి మారుతుంది. వ్యాయామం చేయడమే దీనికి తగిన మందు.

* నాలుక ఎర్ర రంగులో ఉంటే విటమిన్‌ B-12, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉందని భావించాలి. వైరల్ ఇన్ఫెక్షన్లతో జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎర్ర రంగులోకి మారుతుంది.

* అతిగా యాంటీ బయాటిక్స్‌ తీసుకొనే వారి నాలుక నలుపు రంగులోకి మారే అవకాశం ఉంది.

ధూమపానం, అతిగా టీ, కాఫీలు తాగడం నోటి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపడం వల్ల కూడా నాలుక నల్లగా మారుతుంది.

* కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, చూయింగ్‌ గమ్ నమలడం వంటి అలవాట్ల వల్ల నాలుకపై బ్యాక్టీరియా పెరిగి రంగు మారుతుంది.

* నాలుక మీద, నోట్లో పుండ్లు ఏర్పడినట్లయితే మీలో రోగ నిరోధక శక్తి తగ్గిందని తెలుసుకోవాలి. పాల ఉత్పత్తులు, నిమ్మరసం తీసుకోవడం వల్ల అల్సర్లు దరిచేరవు.

* దీర్ఘకాలంపాటు నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. అల్సర్లు దీర్ఘకాలికంగా ఉండటం క్యాన్సర్‌కు సంకేతం.

* ఉదయం బ్రష్ చేసిన తర్వాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే నోట్లో బ్యాక్టీరియా పెరిగి అనారోగ్యానికి గురవుతారు.

Tags :

Advertisement