Advertisement

  • తెల్ల బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు

తెల్ల బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు

By: chandrasekar Tue, 08 Sept 2020 10:24 AM

తెల్ల బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు


మన ప్రధాన ఆహారం అన్నం. అయితే కేవలం బాగా పాలిష్‌ చేసిన తెల్ల బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు చాలా ఎక్కువని, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో చాలా మంది కేవలం ఈ కారణంగానే మధుమేహం బారిన పడుతున్నారని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఇండియా, చైనా, బ్రెజిల్‌ తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా 21 దేశాల్లో 1.32లక్షల మందిపై పదేండ్ల పాటు అధ్యయనం నిర్వహించి ఈ వివరాలను పేర్కొన్నారు.

అధ్యయనంలో భాగంగా ఈ లక్ష మందిలో రోజు ఎంత అన్నం తింటున్నారు. అన్నం కాకుండా ఏం తింటున్నారు. వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయన్న విషయాలను గమనించారు. కొన్ని దేశాల్లో తెల్లబియ్యం ఎక్కువగా తింటున్నప్పటికీ వారిలో డయాబెటిస్‌ ముప్పు తక్కువగా ఉన్నదని అందుకు వారి జీవన విధానమే కారణం అని శాస్త్రవేత్తలు వివరించారు. భారత్‌లో అన్నం వల్ల మధుమేహం ముప్పు ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ అధ్యయనానికి పాపులేషన్‌ హెల్త్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త భవధరిణి బాలాజీ నేతృత్వం వహించారు.

Tags :

Advertisement