Advertisement

  • ధూమపానం అలవాటు ఉన్న వారిలో కరోనా ప్రభావం ఎక్కువ

ధూమపానం అలవాటు ఉన్న వారిలో కరోనా ప్రభావం ఎక్కువ

By: chandrasekar Thu, 09 July 2020 6:09 PM

ధూమపానం అలవాటు ఉన్న వారిలో కరోనా ప్రభావం ఎక్కువ


సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవారిలో తీవ్రమైన అనారోగ్యానికి ఎక్కువ ప్రమాదం ఉన్నదని, ఇది కరోనా వైరస్ రోగుల మరణానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. అయితే, ధూమపానం వల్ల ఆ ప్రమాదాల స్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందో డబ్ల్యూహెచ్‌వో వివరించలేకపోయింది.

ధూమపానం కరోనా మధ్య సంబంధంపై ఈ వారం ప్రచురించిన 34 అధ్యయనాలను ఆరోగ్య సంస్థ సమీక్షించింది. వీటిలో వ్యాప్తి, దవాఖానలో చేరడం, అనారోగ్యం, మరణం వంటివి ఉన్నాయి.

దవాఖానలో చేరిన కరోనా వైరస్ రోగుల్లో ధూమపానం చేసేవారి శాతం 18 శాతంగా ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. సిగరెట్‌ స్మోకింగ్‌ హాబిట్‌గా ఉన్నవారు కరోనా వైరస్‌కు గురైతే వారికి అవసరమైన చికిత్స అందించనిపక్షంలో చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

ఇలాఉండగా, ఫ్రెంచ్ పరిశోధకులు ఏప్రిల్‌ నెలలో ఒక చిన్న అధ్యయనాన్ని విడుదల చేశారు. ధూమపానం చేసేవారు కొవిడ్-19 బారిన పడే ప్రమాదం తక్కువగా ఉన్నదని కనుగొన్నారు. సిగరెట్‌ తంబాకుతో కలిసిన ఉన్న నికోటిన్ కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుందని వారు విశ్వసించారు.

ఈ పరిశోధనలను చాలా మంది శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ధూమపానం కారణంగా అనారోగ్యానికి గురై చనిపోయే పరిస్థితులు ఎక్కువగా పెరిగినట్లు అందుబాటులో ఉన్న సాక్ష్యాలు సూచిస్తున్నాయి. అందువలన ప్రజలు ధూమపానం మానేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తికి గురికాకుండా ఉండగలరు.

Tags :
|
|
|

Advertisement