Advertisement

పియర్స్ పండ్లు తీసుకోవడంవల్ల కలిగే లాభాలు

By: chandrasekar Tue, 09 June 2020 7:26 PM

పియర్స్ పండ్లు తీసుకోవడంవల్ల కలిగే లాభాలు


పియర్స్ (బేరికాయ) తియ్యగా కొంచం వగరుగా ఉంటుంది. ఇది యాపిల్స్‌కు, సీమదానిమ్మలకు దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ పండు తోలు పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపురంగులోగాని పై వాటిలో రెండు, మూడు రంగుల కలయికతో గాని ఉంటుంది. లోపలిభాగం తెలుపు లేదా లేతపసుపురంగులో ఉంటుంది. బాగా తియ్యగా, రసాత్మకంగా ఉంటుంది. ఈ కండ లోపలగా మధ్యలో గింజలుంటాయి.

మాములుగా వగరు రుచి గుండె బలపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పియర్స్ లో వగరు రుచి ఉండడంవల్ల గుండె కి మేలు కలుగుతుంది. పియర్స్ లో విటమిన్లు ఎ, బి, డి, ఇ మరియు మినిరల్స్ పొటాషియం, ఫాస్పరస్, మరియు కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఈ పండులో ఇంకా చిన్న మొత్తంలో ఐరన్ కూడా ఉంది . అయితే చాలా మందికి ఈ బేరిపండు యొక్క ఆరోగ్యలాభాలు గురించి అంతగా తెలియదు.

సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు. రూపం, రంగు, రుచి, పరిమాణం నిల్వ ఉండే లక్షణాల మీద ఆధారపడి ఎన్నో రకాలుగా మనకు లభిస్తోంది. ఆరోగ్య పరంగా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది. మార్కెట్‌లో మనకు దొరికే అనేక రకాల పండ్లలో పియర్స్ పండ్లు కూడా ఒకటి. ఇవి మన శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

the benefits,of taking,pears,fruits,people ,పియర్స్, పండ్లు, తీసుకోవడంవల్ల, కలిగే, లాభాలు


* పియర్స్ పండ్లను తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని, గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

* పియర్స్ పండ్లను రెగ్యులర్‌గా తింటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పలువురు డచ్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 52 శాతం వరకు తక్కువగా ఉంటాయట.

* రక్తహీనత సమస్య ఉన్నవారు, పుట్టుకతో లోపాలు ఉన్నవారు, ఎముకలు, దంతాలు సమస్యలు కలిగిన వారు పియర్స్ పండ్లను తింటుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా బయట పడవచ్చు. అలాగే పియర్స్ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

the benefits,of taking,pears,fruits,people ,పియర్స్, పండ్లు, తీసుకోవడంవల్ల, కలిగే, లాభాలు


* ఒక కప్పు పియర్స్ పండ్లలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరానికి నిత్యం కావల్సిన మోతాదులో 20 శాతం. అందువల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది. అలాగే చెడు బాక్టీరియా నశిస్తుంది.

* పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండాలన్నా దానికి ఎలాంటి వాపు రాకుండా ఉండాలన్నా నిత్యం సుఖ విరేచనం అవ్వాలన్నా పియర్స్ పండ్లను తినాలి. ఈ పండ్ల వల్ల పెద్ద పేగులో మలం కదలిక సులభంగా ఉంటుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది.

* పియర్స్ లో ఉండే డైటరీ ఫైబర్ స్కిన్ స్మూత్ గా ఉంచడానికి సహాయపడుతుంది. స్కిన్ కొల్లాజెన్ ను డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది. బేరిపండ్లను రెగ్యులర్ గా తింటుంటే ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

Tags :
|
|

Advertisement