Advertisement

సమ్మర్ స్పెషల్ తాటిముంజలు

By: chandrasekar Mon, 08 June 2020 5:25 PM

సమ్మర్ స్పెషల్ తాటిముంజలు

ఎండాకాలంలో తాటిముంజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో వేసవి తాపాన్ని తొలగించే విధంగా ఆహారం తీసుకోవాలి. శరీరానికి నీటి శాతం అధికంగా వుండే పండ్లను తీసుకోవాలి. అలాంటి వాటిల్లో పుచ్చకాయ, దోసకాయలు ముందుంటాయి. తాటిముంజలు తినడానికి జల్లి లాగా అలాగే నోటిలో జారిపోతాయి.

తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలున్నాయి. ఇవి శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తాయి. అలాగే బరువు కూడా సులభంగా తగ్గిపోతుంది. తాటి ముంజలను రోజు ఒక కప్పు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తాటిముంజలు లోని నీరు చెమటకాయలకు దివ్యఔషధం. వీటిని చర్మం పై పూసుకుంటే చెమటకాయలు మటుమాయం. శరీర వేడిని తగ్గిస్తుంది.

summer,special,palm,fruit,healthy ,సమ్మర్, స్పెషల్, తాటిముంజలు, ఎండాకాలంలో, వేసవి

ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు అందం పరంగా కూడా ముంజలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

వేసవిలో అత్యంత చలువ చేసేది, ఈ కాలంలో మాత్రమే దొరికేది అవే తాటి ముంజలు. గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజలు విరివిగా దొరుకుతుంటాయి. అదే నగరాల్లో అయితే అవి దొరకడమే గగనం. అందుకే వాటి విలువ తెలిసిన వారు ధర ఎంతైనా సరే కొనడం మాత్రం మానుకోరు. పొటాషియం అర‌టి పండ్ల‌లో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజ‌ల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బ‌రువును నియంత్రిస్తుంది.

వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖ‌ర్చ‌వుతుంది. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. అలాంటి పరిస్థితిలో తాటి ముంజ‌ెల‌ను తీసుకుంటే శ‌రీరంలోకి ద్ర‌వాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. దీని వల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు బారినపడే వారికి తాటి ముంజ‌ెల‌ను తినిపిస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వీటిని తింటే శ‌క్తి వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల‌కు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము కేన్స‌ర్‌తోపాటు ఇత‌ర కేన్స‌ర్ల‌ను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజ‌ెల్లో ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement