Advertisement

  • నేటి యువతను బాధపెడుతున్న న‌డుము నొప్పికి తీసికోవలసిన జాగ్రత్తలు

నేటి యువతను బాధపెడుతున్న న‌డుము నొప్పికి తీసికోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Thu, 10 Sept 2020 08:58 AM

నేటి యువతను బాధపెడుతున్న న‌డుము నొప్పికి తీసికోవలసిన జాగ్రత్తలు


ప్రస్తుతం యువకుల నుండి వృద్దుల వరకు నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఇందుకు సరైన ఆహార నియమాలు పాటించకపోవడమే కారణమంటున్న ఆరోగ్య నిపుణులు. దీనితో బాటు సరైన వ్యాయామం కూడా చేయక పోవడంతో మరిన్ని అనారోగ్యాలకు దారితీస్తున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో న‌డుము నొప్పి లేదు అనే వాళ్లే క‌నిపించ‌డం లేదు. చిన్న పెద్దా ఎవ‌రైనా కాసేపు కూర్చుంటే చాలు న‌డుము నొప్పి అని ప‌డుకుంటున్నారు.

ఈ డిజిటల్ యుగంలో ఎవరు కూడా వ్యాయామం చేయకుండా వారి జీవ‌ణ‌శైలి లో మార్పువల్ల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. రోజంతా కంప్యూట‌ర్ల ముందు ఎక్కువ‌గా కూర్చోవ‌డం వ‌ల్ల చాలామంది బ్యాక్‌పెయిన్‌కు గుర‌వుతున్నారు. ఇలాంటివారు ప్ర‌తిరోజూ ఖ‌ర్జూరం తిన్న త‌ర్వాత వేడి నీరు తాగితే న‌డుము నొప్పి నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే గంధం, శొంఠిని బాగా నూరి ఆ మిశ్ర‌మాన్ని న‌డుముకు అప్లై చేయాలి. ఇలా చేస్తే కాస్త ఉప‌శ‌మ‌నం దొరుకుతుంది.

అప్పటికి నడుంనొప్పి త‌గ్గ‌కుంటే ఆ మిశ్ర‌మం మీద తెల్ల‌జిల్లేడు ఆకులు క‌డితే బాగా ప‌నిచేస్తుంది. ఒక గ్లాస్ మ‌జ్జిగ తీసుకొని అందులో మూడు టీస్పూన్లు సున్న‌పు తేట వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని వారం రోజుల పాటు ఉదయాన్నే తాగాలి. ఇలా చేస్తే న‌డుము నొప్పి హుష్‌కాకి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే తినే ఆహారంలో కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్‌ను ప‌క్క‌న‌పెట్టి పాలు, చీజ్‌, పెరుగు, బీట్‌రూట్‌, గెనిసిగ‌డ్డ‌లు, ద్రాక్ష‌, దానిమ్మ‌, బెర్రీస్‌, పుచ్చ‌కాయ‌, క్యారెట్లు వంటివి ఎక్కువ‌గా తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు వంట‌ల‌లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగ‌డ్డ‌, దాల్చిన చెక్క వంటి వాటిని చేర్చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారపు అలవాట్లలో గణనీయముగా చోటుచేసుకున్న మార్పువల్ల అనారోగ్య సమస్యలకు కారణంగా చెపుతున్నారు.

Tags :

Advertisement