Advertisement

వడదెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Wed, 27 May 2020 6:28 PM

వడదెబ్బకు తీసుకోవలసిన జాగ్రత్తలు


మండే ఎండలకు వడదెబ్బ నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండండి. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే.. కరోనా సోకుతుందో లేదో తెలీదుగానీ వడదెబ్బ తగలడం మాత్రం గ్యారంటీ. ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపు తప్పుతుంది మరియు శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు.

చల్లని నీళ్లు తాగుతూ శరీరాన్ని సమతులంగా ఉంచుకోవటం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే, ఇంట్లో కుర్చున్నవారికి కూడా వడదెబ్బ తగులుతుంది. ఇంట్లో ఎక్కువ వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి.


precautions,taken,for,sunstroke,water ,వడదెబ్బకు, తీసుకోవలసిన, జాగ్రత్తలు, మండే, ఆరోగ్యాన్ని


శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ వల్ల 40 శాతం మేరకు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది.

శరీరం అదుపుతప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవ్వుతారు. కళ్లు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవ్వుతారు. శరీరంలోని రక్త కణాలు కుంచించుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్‌‌ దెబ్బతింటాయి.

precautions,taken,for,sunstroke,water ,వడదెబ్బకు, తీసుకోవలసిన, జాగ్రత్తలు, మండే, ఆరోగ్యాన్ని


తీసికోవలసిన జాగ్రత్తలు:

* ప్రతిరోజు మజ్జిగ, నిమ్మరసం తీసుకోండి.

* వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. గొడుగు తీసుకెళ్లాలి.

* రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.

* సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి.

* ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలి.

* వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.

* నూనె పదార్థాల వాడకం తగ్గించాలి.

* కొబ్బరి బోండాం, మజ్జిగ తాగండి.

* బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి.

* అలాగే బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా నీళ్ల బాటిల్ తీసుకెళ్లండి.

* మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.

* ఈ వేసవిలో కీరదోస ముక్కల్ని ఎక్కువగా తినడండి. దీనివల్ల శరీరానికి నీటితోపాటు పోషకాలు కూడా అందుతాయి. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.

* శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు తాగాలి.

* వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉల్లిపాయను మెత్తగా నూరి శరీరానికి రాయాలి.

* జీలకర్ర దోరగా వేయించి పొడిచేయండి. అర స్పూన్ పొడిని ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగితే శరీరానికి బోలెడంత ఎనర్జీ వస్తుంది.

* ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Tags :
|
|

Advertisement