Advertisement

కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Fri, 19 June 2020 7:26 PM

కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు


మనం వాడే వస్తువులపై కరోనా వైరస్ ఉంటే ఏం చేయాలో ఆ విషయం మనకు తెలియదు, అది మన కంటికి కనిపించదు కాబట్టి మనం ఏం చెయ్యాలో తెలియదు. కానీ, మనకు నిత్యవసరాలు, అత్యవసరాలు, మందుల వంటివి తప్పనిసరిగా కావాలి కాబట్టి వాటి కోసం ఇంట్లోంచీ బయటకు వెళ్తాం. కొని తెచ్చుకుంటాం. తీరా తెచ్చాక వాటిని ఎంత మంది తాకారో, వారిలో ఎవరెవరికి కరోనా ఉందో, ఎన్ని వస్తువులపై కరోనా ఉందో మనకు తెలియదు. చూడ్డానికి అన్నీ బాగానే ఉంటాయి. కరోనా ఉండదులే అనుకుంటే, మనం మోసపోయినట్లే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇలాగే లక్షల మందిని మోసం చేస్తోంది. కాబట్టి మనం వస్తువులపై కరోనా అంతు చూడటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇంటి గడపదాటేలోపే మీ ముఖానికి మాస్కు ఉండాలి, చేతులపై శానిటైజర్ ఉండేలా చేసుకోవాలి. శానిటైజర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.

* సామాన్లు తెచ్చుకోగానే ముందుగా మీ రెండు చేతుల్నీ సబ్బుతో చక్కగా 20 సెకండ్ల పాటూ కడుక్కోవాలి. తర్వాత చేతుల్ని టవల్‌తో తడి లేకుండా తుడుచుకోవాలి.

* ఇప్పుడు సామాన్లను నీటితో కడిగే ఛాన్స్ ఉన్న వాటిని నీటితో కడగాలి. (మీరు తెచ్చే ప్రతీ వస్తువుపైనా కొన్ని లక్షల కరోనా వైరస్ ఉంటుందని మీరు బలంగా నమ్మాలి. మీకు తెలుసుగా ఓ ఆవగింజంత సైజులో దాదాపు 30వేల కరోనా వైరస్‌లు పడతాయి. అంత చిన్నగా అవి ఉంటాయి.

* వంట వండే ప్రతి సారీ వంటకు ముందు, వంట తర్వాత చేతుల్ని, గిన్నెలనూ బాగా కడగాలి.

* సామాన్ల నుంచి మీరు పారేసే అట్ట ముక్కలు, కవర్లు, వేస్ట్ మెటీరియల్ ఏదైనా సరే డస్ట్ బిన్‌లోనే వెయ్యాలి. వేసిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.

precautions,to be taken,against,infecting,the corona virus ,కరోనా, వైరస్, సోకకుండా, తీసుకోవలసిన, జాగ్రత్తలు


షాపింగ్ చేసేటప్పుడు

* షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఆల్రెడీ అక్కడ క్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ క్యూలో మీరు తప్పనిసరిగా 6 అడుగుల దూరంలో నిల్చోవాలి. మీ వెనక వారిని కూడా 6 అడుగుల దూరంలో ఉండమని చెప్పాలి. వాళ్లు అలా కాదని ముందుకి వస్తే మీరు వారిపై కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వారిని అరెస్టు చేస్తారు.

* 2 వారాలకు ఓసారి మాత్రమే సరుకుల కోసం బయటకు వెళ్లడం మేలు. ఇంట్లో ఒక్కరు మాత్రమే, ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే సామాన్ల కోసం బయటకు వెళ్లాలి.

* ఎప్పుడూ శానిటైజర్ వెంట ఉండాలి. ఏ ప్రదేశాలు, గొట్టాలు, రాడ్లు, డోర్లను ముట్టుకోవద్దు. తప్పనిసరి ముట్టుకోవాల్సి వస్తే మిగతావారు ముట్టుకోని ప్రదేశంలో టచ్ చెయ్యడం మేలు ముట్టుకున్న తర్వాత చేతులకు మళ్లీ శానిటైజర్ రాసుకుంటే బెటర్.

* కరెన్సీ బదులు కార్డుతో చెల్లింపులు చేస్తే మరీ మంచిది.

* షాపింగ్ అయిపోగానే బయటకు వచ్చి వెంటనే మళ్లీ శానిటైజర్ రాసుకోవాలి.

* మరింత ఎక్కువ జాగ్రత్త పడాలనుకుంటే చేతులకు డిస్పోజబుల్ గ్లోవ్స్ తొడుక్కోవచ్చు.

* ఇంటికి రాగానే సామాన్లను బయటే ఉంచి ముందుగా మీరు స్నానం చెయ్యాలి.

* ఇప్పటివరకూ సామాన్లు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ వస్తువులపై మొత్తంగా కరోనా వైరస్ 3 రోజులు ఉంటుందని తెలిసింది. కాబట్టి మీరు తెచ్చిన వస్తువుల్ని 3 రోజులు ఓ చోట దాచి ఉంచి, నాలుగో రోజు నుంచి వాడుకుంటే మేలు. అప్పుడు వాటిపై కరోనా వైరస్ ఉండకపోవచ్చు.

* పండ్లు, కూరగాయల్ని సబ్బుతో కడగాల్సిన పనిలేదని కొందరు చెబుతుంటే వాటిని కూడా సబ్బుతో కడగడం మేలని మరికొందరు చెబుతున్నారు.

* పండ్లు, కూరగాయల్ని ఉప్పు నీరు లేదా నిమ్మకాయ రసం కలిపిన నీటిలో కొన్ని గంటలు ఉంచి, ఆ తర్వాత బయటకు తీసి నీరు లేకుండా గాలి తగిలేలా చేస్తే మంచిదే.

* మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది షాపులు, సూపర్ మార్కెట్ల దగ్గర వీలైనంత తక్కువ సేపు ఉండాలి. వెళ్లామా సామాన్లు తీసుకున్నామా వచ్చేశామా అన్నట్లుగా ఫటాఫట్ షాపింగ్ అయిపోవాలి.

* ఇంటి అరుగులు, డోర్లు, కిటికీలు, స్విట్చ్‌లు, లైట్లు వంటి వాటిని తరచూ క్లీన్ చేస్తూ ఉంటే అక్కడ కరోనా చచ్చిపోతుంది.

Tags :

Advertisement