Advertisement

  • అత్యాధునిక ఫీచర్లు ఉన్న "పోకో M2 Pro" స్మార్ట్ ఫోన్

అత్యాధునిక ఫీచర్లు ఉన్న "పోకో M2 Pro" స్మార్ట్ ఫోన్

By: chandrasekar Thu, 09 July 2020 3:47 PM

అత్యాధునిక ఫీచర్లు ఉన్న "పోకో m2 pro" స్మార్ట్ ఫోన్


ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో సరికొత్త, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫోన్ ను విడుదల చేసింది. "పోకో m2 pro" పేరుతో రూపొందించింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కవైపు అందించారు.

వెనకవైపు నాలుగు కెమెరాలు, కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు ఉన్నాయి.

ఫ్రన్ట్ సైడ్16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ గా ఉంది. పోకో m2 pro మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త ఏదైనా అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Tags :
|
|

Advertisement