Advertisement

పంచదార వాడకాన్ని ఈ విధముగా తగ్గించండి

By: Sankar Sun, 22 Nov 2020 11:02 AM

పంచదార వాడకాన్ని ఈ విధముగా తగ్గించండి


పంచదార అన్న పదం వినగానేనే నోట్లో నీళ్ళూరతాయి, వెంటనే ఏదైనా తియ్యగా తినాలని అనిపిస్తుంది. మిట్ట మద్యాన్నం, అర్ధ రాత్రి, పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు, అసలే పనీ లేకుండా బద్ధకం గా కూర్చుని ఉన్నప్పుడూ తీపి మీదకి మనసు పోతుంది. కానీ పంచదార తీసుకోవడం ఎక్కువైతే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువవుతుంది..అందుకే పంచదార వాడకుండా దాని స్థానంలో స్వీట్ నెస్ కోసం ఏ పదార్ధాలు తీసుకోవోచో ఇపుడు తెలుసుకుందాం..

1. పంచదార బదులు బెల్లం, తేనె వంటివి వాడడం, పంచదార వేసే స్వీట్స్ కాకుండా బెల్లం వేసే స్వీట్స్ చేసుకోవడం. అంటే రవ్వ కేసరి, చక్ర పొంగలి, పాయసం వంటి స్వీట్స్ బదులు సున్ని ఉండలు, నువ్వుల లడ్డూ వంటి స్వీట్స్ తీసుకోవడం ..

2. తియ్యగా తినాలని అనిపిస్తోందా, వెంటనే ఏదైనా పండు తినండి. ఇందు వల్ల షుగర్ క్రేవింగ్ వెంటనే తగ్గిపోతుంది.

3. మీల్స్ మధ్యలో హెల్దీ స్నాక్స్ తీసుకుంటూ ఉంటే షుగర్ క్రేవింగ్స్ ఉండవు.

4. సాఫ్ట్ డ్రింక్స్ బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, పంచదార కలపని స్మూతీలు, జ్యూసులు తీసుకోండి.

5. మీ బ్రేక్ ఫాస్ట్ పోరిడ్జ్ లో షుగర్ బదులు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివి యాడ్ చేసుకోండి.

Tags :
|
|
|
|

Advertisement