Advertisement

మెంతుల లోని ఔష‌ధ గుణాలు

By: chandrasekar Wed, 17 June 2020 8:10 PM

మెంతుల లోని  ఔష‌ధ గుణాలు


మన దేశంలో వంట‌ల్లో రుచి, సువాస‌న కోసం ఉప‌యోగించే ప్ర‌తి వ‌స్తువులో ను ఔష‌ధ గుణాలుంటాయి. అల్లం, వెల్లుల్లి, యాల‌కులు, ల‌వంగాలు, క‌రివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తిదీ ఔష‌ధంగా మన జీవితంలో ఉప‌యోగప‌డుతుంది. అదేవిధంగా ప‌చ్చి చేప‌ల కూర‌లో సువాస‌న కోసం, నిలువ ప‌చ్చ‌ళ్ల‌లో చ‌ల్ల‌ద‌నం కోసం ఉప‌యోగించే మెంతుల్లో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలున్నాయి. మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో వాడుతూ ఉంటారు.

మెంతులు పసుపు రంగులో ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. మెంతులను వేయించినప్పుడు ఇంకా చక్కని సువాసన వస్తుంది. అయితే మెంతులు చేదుగా ఉంటాయి. అందువల్ల వంటకాలలో తక్కువ మోతాదులో వాడతారు. మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అంతేకాక యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

medicinal,properties,fenugreek,healthy,powder ,మెంతుల లోని,  ఔష‌ధ, గుణాలు,


* మొలకెత్తిన మెంతులు తిన‌డంవ‌ల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
* మ‌ల‌బ‌ద్ధ‌కం వ‌చ్చిన‌ప్పుడు మెంతులు తిన‌డం ద్వారా మంచి ఫ‌లితం ఉంటుంది.
* జ‌లుబు, ఒంటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు గోరువెచ్చ‌ని నీళ్ల‌లో మెంతులు వేసుకుని తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
* మెంతులు శరీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌గ్గిస్తాయి.
* బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డానికి మెంతులు తోడ్ప‌డుతాయి.
* నిత్యం మెంతులు తీసుకోవ‌డం ద్వారా కీళ్ల‌ నొప్పులు త‌గ్గుతాయి.
* కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యానికి మెంతులు తోడ్ప‌డుతాయి.
* నెల‌స‌రి స‌మ‌యంలో క‌డుపు నొప్పి వ‌చ్చిన‌ప్పుడు గోరువెచ్చ‌ని నీటిలో మెంతులు వేసుకుని తాగితే ఉప‌శ‌మ‌నం ఉంటుంది.
* మెంతులు కొలెస్ట‌రాల్‌ను నియంత్రిస్తాయి.
* కండ‌రాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
* దోస పిండిలో మెంతులు వాడడం వాళ్ళ దోసెలు మోర మోర ని బాగా రుచిగా ఉంటాయి.
* కొబ్బరి నూనెలో మెంతుల్లో వేసి చేసి తలకు మర్దనం చేయడం ద్వారా వేడి తగ్గి జుట్టు మెరిసిపోతుంది.

Tags :

Advertisement