Advertisement

  • అమ‌ర్‌నాథ్ గుహ ఆల‌యంలో తొలి హార‌తికి హాజరైన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ల్

అమ‌ర్‌నాథ్ గుహ ఆల‌యంలో తొలి హార‌తికి హాజరైన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ల్

By: chandrasekar Mon, 06 July 2020 10:48 AM

అమ‌ర్‌నాథ్ గుహ ఆల‌యంలో తొలి హార‌తికి హాజరైన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ల్


అమ‌ర్‌నాథ్ గుహ ఆల‌యంలో ఆదివారం జ‌రిగిన తొలి హార‌తి కార్య‌క్ర‌మానికి జ‌మ్మూ క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ల్ (ఎల్జీ) గిరీష్ ‌చంద్ర ముర్ము హాజ‌ర‌య్యారు. ఈ మేర‌కు ఆల‌య బోర్డు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ఆయన తోపాటు శ్రీ అమర్‌నాథ్ జీ ఆలయ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి బిపుల్ పాఠక్, అదనపు సీఈవో ఏకే సోని, డివిజన్ కమిషనర్ క‌శ్మీర్ పాండురంగ్ కే పోల్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ క్ర‌మంలో భ‌క్తుల ద‌ర్శ‌నంపై నిషేధం విధించ‌గా, ప్ర‌సార భార‌తిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌క్తుడు కార్తీక్ మాట్లాడుతూ ఎప్పుడు స్వామి వారి ద‌ర్శ‌నానికి వెళ్లే వార‌మ‌ని, ఈ సారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా వెళ్ల‌లేక‌పోయామ‌ని తెలిపాడు. టీవీలో స్వామి వారి ద‌ర్శ‌నం చూస్తే చాలా సంతోష‌మ‌నిపించింద‌ని పేర్కొన్నాడు.

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు సంబంధించిన అధికారిక తేదీని ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ ఏడాది యాత్ర‌ను నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ది. మ‌హ‌మ్మారి దృష్ట్యా రోజుకు గ‌రిష్ఠంగా 500 మంది యాత్రికుల‌ను జ‌మ్మూ నుంచి రోడ్డు మార్గం ద్వారా అనుమ‌తించే అవ‌కాశం ఉంది. ఏ యేడాది దూర‌ద‌ర్శ‌న్‌లో అమ‌ర్‌నాథ్ హార‌తిని ఆగ‌స్టు 3 వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతుంద‌ని జమ్మూ క‌శ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీ సుబ్రహ్మణ్యం ఇది వ‌ర‌కే తెలిపారు.

Tags :
|

Advertisement