Advertisement

  • మెద‌డుకి స‌రిప‌డా ఆక్సిజ‌న్ అంద‌క పోతే ఆవ‌లింత‌లు వ‌స్తాయి

మెద‌డుకి స‌రిప‌డా ఆక్సిజ‌న్ అంద‌క పోతే ఆవ‌లింత‌లు వ‌స్తాయి

By: chandrasekar Tue, 30 June 2020 1:11 PM

మెద‌డుకి స‌రిప‌డా ఆక్సిజ‌న్ అంద‌క పోతే ఆవ‌లింత‌లు వ‌స్తాయి


ఒక‌రికి ఆవలింత వస్తే చాలు ఎదుటి వారు ఎంత యాక్టివ్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ వారికి కూడా ఆవ‌లింత వచ్చేస్తుంది. అలాగే బాగా అల‌సిపోయినా నిద్రొస్తున్న‌ట్లుగా ఆవిలింత‌లు మొద‌ల‌వుతాయి. ఇప్పుడు ఇది చ‌దువుతున్నా కూడా మీకు ఆవ‌లింత రావ‌డం ఖాయం.

మ‌రి ఇలా ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయి అన్న విష‌యంపై ఇంకా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్ప‌టి నుంచే బిడ్డ‌కు ఆవ‌లింత‌లు మొద‌ల‌వుతాయి.

అప్పుడు మొద‌లైన అల‌వాటు జీవితాంతం వ‌ద‌లిపెట్ట‌దు. ఈ ఆవ‌లింత‌లు రావ‌డానికి ముఖ్య కార‌ణం మెద‌డుకి స‌రిప‌డా ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డ‌మే అని అప్పుడెప్పుడో శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఇప్పుడూ అదే చెబుతున్నారు.

మెద‌డుకి ఆక్సిజ‌న్‌ను అందించ‌డానికి శ‌రీరం ఆవ‌లింత‌ల రూపంలో అధిక మొత్తంలో గాలిని తీసుకుంటుంది. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. మ‌నిషి త‌న జీవితకాలంలో 400 గంట‌లు ఆవ‌లిస్తాడ‌ట‌. అంటే 2.4 ల‌క్ష‌ల సార్లు ఆవ‌లిస్తార‌న్న‌మాట‌. మ‌రి ఆవ‌లింత‌లు మ‌నుషుల‌కే వ‌స్తాయి అనుకొంటున్నారా? కాదు జంతువులకు కూడా ఆవలింతలు వస్తాయి.


Tags :
|

Advertisement