Advertisement

బెల్లం తో మలబద్ధకం నివారణ ఎలా

By: Dimple Fri, 17 July 2020 1:30 PM

బెల్లం తో మలబద్ధకం నివారణ ఎలా


మలబద్ధకం అనేది ఇబ్బందికర సమస్యే. దీన్ని రైట్ టైమ్ లో సరిగ్గా డీల్ చేయకపోతే మరిన్ని కాంప్లికేషన్స్ బారిన పడాల్సి రావచ్చు. కాన్స్టిపేషన్ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. వీటిని పాటిస్తే ఉపశమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈరోజు మనం ఆ రెమెడీస్ గురించి తెలుసుకుందాం.

కాన్స్టిపేషన్ అనేది ఎంతో సాధారణ కండిషన్. ఎంతో మంది ఈ సమస్య గురించి బయటకు వెల్లడించకపోయినా సైలెంట్ గా సఫర్ అవుతున్నారన్నది వాస్తవం. ఈ సమస్యతో పాటు ఇంకెన్నో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. గ్యాస్, బ్యాక్ పెయిన్ అలాగే విపరీతమైన అలసట వంటి ప్రాబ్లెమ్స్ అనేవి కాన్స్టిపేషన్ సమస్యతో లింక్ అయి ఉంటాయి. డయాబెటిస్, పీసీఓడీ, నిద్ర సరిగ్గా లేకపోవడం, హైపర్ థైరాయిడ్ తో పాటు బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలున్న వారిలో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లెమ్ కనిపిస్తుంది. అలాగే, కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ ప్రాబ్లెమ్ ను నేచురల్ గానే ఫిక్స్ చేయవచ్చు. మెడిసిన్స్ పై గానీ లేదా సప్లిమెంట్స్ పై గానీ ఆధారపడకుండా సులభంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

మూడు సింపుల్ ఫుడ్స్ ను డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా కాన్స్టిపేషన్ కు నేచురల్ గా సొల్యూషన్ లభిస్తుంది. కాన్స్టిపేషన్ సమస్య లేని వారు కూడా ఈ ఫుడ్స్ తో ఈ సమస్య బారిన పడే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. ఈ ఫుడ్స్ లో వివిధ రకాల పోషకాలతో పాటు హెల్త్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని రోజులో మూడు వేరు వేరు సమయాల్లో తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు.

రెమెడీ 1:
బెల్లం, నెయ్యి:

ప్రతి ఒక్కరికి స్వీట్ తినాలన్న కోరిక కలగడం సహజం. ఐతే, ఈ కోరికను ఎలా డీల్ చేశామన్న దానిపై రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయని గమనించాలి. బెల్లాన్ని నేతితో కలిపి తినడం వలన మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, నేతిలో ముఖ్యమైన ఫ్యాట్స్ లభిస్తాయి. ఈ రెండూ కలిపి డైజెషన్ స్మూత్ గా జరిగేందుకు హెల్ప్ చేస్తాయి. అలాగే ఇంటస్టైన్స్ హెల్త్ ను కూడా సంరక్షిస్తాయి. కాబట్టి, మీరు చేయవలసిందేంటంటే, బెల్లం పౌడర్ ను తీసుకుని అందులో కాసింత నెయ్యిని కలపండి. లంచ్ తరువాత ఈ మిక్స్ ను తినండి. ఈ రెమెడీ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుందని చెప్పవచ్చు.

రెమెడీ 2:
మస్కమేలన్:

చాలాసార్లు శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. కాబట్టి, ఈ సమస్యను హెల్తీ వేలో డీల్ చేయాలంటే సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవడం ముఖ్యం. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ను తీసుకోవడం మరీ ముఖ్యం. దాంతో, శరీరంలో వాటర్ కంటెంట్ అనేది మళ్ళీ భర్తీ అవుతుంది. మస్క్ మెలన్ పై కూడా ఫోకస్ పెట్టాలి. ఇది బ్లోటింగ్ సమస్యనునివారిస్తుంది. మస్క్ మెలన్ ను సాయంత్రం స్నాక్స్ గా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో దీన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

రెమెడీ 3:
నువ్వుల నూనె:

నువ్వుల నూనె అనేది కాన్స్టిపేషన్ ను తగ్గించే రెమెడీస్ లో అత్యంత పాపులరైనది. కాబట్టి, దీన్ని డిన్నర్ లో తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. నువ్వుల నూనెలో ఫైబర్ తో పాటు విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ముఖ్యమయిన ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఒక స్పూన్ ను పిండితో కలుపుకుని తినండి. కాన్స్టిపేషన్ సమస్యను సరైన సమయంలో పరిష్కరించుకోకపోతే ఇంకొన్ని డేంజరస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. పైన చెప్పుకున్నటువంటి ఫుడ్ రెమెడీస్ తో పాటు మీరు మరికొన్ని చిట్కాలను పాటిస్తే త్వరగా రిజల్ట్స్ ను త్వరగా చూడగలుగుతారు.

మరికొన్ని చిట్కాలు

1. నీళ్లను తాగండి:
తగినన్ని నీళ్లను తాగడం వలన కాన్స్టిపేషన్ ను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం కూడా కాన్స్టిపేషన్ ను కారణం. కాబట్టి, తగినన్ని నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. అవసరమైతే రిమైండర్స్ పెట్టుకోండి.

2. వ్యాయామం చేయండి:
అనేక ఫుడ్ రెమెడీస్ మన డైట్ లో భాగంగా చేసుకున్నా మన లైఫ్ స్టైల్ లో మార్పులు లేకపోతే ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లెమ్ వస్తుంది. కాబట్టి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. బాడీ యాక్టివ్ గా ఉంటుంది, డైజెషన్ కుల యాక్టివ్ గా ఉంటుంది.

Tags :
|
|

Advertisement