Advertisement

  • మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిస్క్ తక్కువ... అదే వీకెండ్‌లో గుండెపోటు వస్తే బ్రతికే ఛాన్స్ తక్కువ..!

మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిస్క్ తక్కువ... అదే వీకెండ్‌లో గుండెపోటు వస్తే బ్రతికే ఛాన్స్ తక్కువ..!

By: Anji Sun, 25 Oct 2020 7:58 PM

మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిస్క్ తక్కువ... అదే వీకెండ్‌లో గుండెపోటు వస్తే బ్రతికే ఛాన్స్ తక్కువ..!

ఈ జనరేషన్‌లో చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఒకప్పుడైతే 50 ఏళ్లు దాటినవారు గుండె జబ్బులతో బాధపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిళ్లు కారణంగా చాలామందికి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.

ఇక తాజాగా ఏయే సమయాల్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తే ఎక్కువ రిస్క్ ఉంటుందన్న దానిపై యూకేకి చెందిన పలువురు పరిశోధకులు పరిశోధన చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఏ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చినా రిస్క్ తక్కువ ఉంటుందని.. అదే వీకెండ్‌లో గుండెపోటు వస్తే బ్రతికే ఛాన్స్ తక్కువ అని పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వారంతంలోని ఓ నిర్దిష్టమైన సమయాన్ని తీసుకుని.. ఆ సమయంలో గుండెపోటు వచ్చినవారిపై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. వీకెండ్‌లో పార్టీ కల్చర్ ఎక్కువ కావడం.. అప్పుడు తీసుకునే ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ లాంటి పలు కారణాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఫిలడెల్ఫీయాలో తిరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ స్కిన్స్ సింపోజియం సదస్సులో యూకేకు చెందిన పరిశోధకులు ప్రకటించారు.

అలాగే గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు సోమవారాల్లో కూడా అధికంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. వర్క్ స్ట్రెస్ కారణంగా ఇవి ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా గుండె జబ్బులు అనేవి చాలా ప్రమాదకరం. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకుని, స్ట్రెస్ తగ్గించుకుంటే వాటి నుంచి దూరంగా ఉండొచ్చు.

Tags :

Advertisement