Advertisement

గుమ్మడితో ఆరోగ్యము

By: chandrasekar Fri, 12 June 2020 7:36 PM

గుమ్మడితో  ఆరోగ్యము


గుమ్మడి లో ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికు తక్కువ క్యాలరీలు అందిస్తుంది . కండ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్" సి" కుడా సంవృద్దిగా లభిస్తుంది . డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. బి.పి.ని నియంత్రిస్తుంది, పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కోలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాధులు తగ్గుతాయి .ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది.

గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి.

అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

health,with pumpkins,getting energy,vitamins,minerals ,గుమ్మడితో , ఆరోగ్యము


చాలా మంది డయాబెటిస్‌తో బాధపడేవారికి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. ఈ చిన్న గింజలు తింటే మాత్రం ఫలితం ఉంటుంది. ఎలుకలపై ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి. అందువల్ల మనుషులపైనా ఇవి చక్కగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్లు.

ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయిగా... అవన్నీ గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇతరత్రా తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి.

కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి. వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యకు చెక్ పెట్టాలంటే పంప్కిన్ సీడ్స్ తినెయ్యడమే

health,with pumpkins,getting energy,vitamins,minerals ,గుమ్మడితో , ఆరోగ్యము


కెరాటెనాయిడ్స్, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఈ గింజలు మన బాడీలో వేడిని తగ్గిస్తాయి. కణాల్ని విష సూక్ష్మక్రిముల నుంచీ కాపాడతాయి. రోజూ ఈ గింజలు తింటే జలుబు, జ్వరం వంటివి కూడా రావు.

ఈ గింజల్లో కుకుర్బిటిన్ ఉంటుంది. అది జుట్టును పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు మన టీమిండియా జట్టులా బలంగా, ఒత్తుగా తయారవుతుంది.

ఈ గింజలు ఎలా తినాలి అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. వాటిని పచ్చిగా ఉన్నవే తినవచ్చు. లేదా వేపుకొని సాయంత్రం వేళ స్నాక్స్‌లా తినవచ్చు. అంతే కాదు సలాడ్లు, సూప్‌లలో కూడా వాటిని వేసుకొని తినవచ్చు. ఎలా తిన్నా, తినడం ముఖ్యం.

Tags :
|

Advertisement