Advertisement

పెసళ్ళ తో ఆరోగ్యం

By: chandrasekar Mon, 08 June 2020 4:35 PM

పెసళ్ళ తో ఆరోగ్యం


పెసరట్టు ద్వారా పెసళ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వేసవిలో వారానికి రెండుసార్లైనా పెసళ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఫైబ‌ర్‌, ఫోలేట్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి1, పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాప‌ర్‌, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి2, బి3, బి5, బి6, సెలీనియంలు ల‌భిస్తాయి. పొటాషియం గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది.

పెస‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీని వ‌ల్ల మ‌న‌కు వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. పెస‌ల‌ను తింటే ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

health,with peasants,eating,dosa,week ,పెసళ్ళ తో, ఆరోగ్యం,  తిన‌డం, వ‌ల్ల శ‌రీరానికి, ఫైబ‌ర్‌,


పెస‌ల్లో పొటాషియం, మెగ్నిషియం పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు పెస‌ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది. అలాగే గ‌ర్భిణీలు నిత్యం పెస‌ల‌ను తింటే ఫోలేట్ బాగా అందుతుంది. త‌ద్వారా బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుందని, సళ్లతో పెసరట్టు చేసుకోవడం ద్వారా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని.. వారానికి రెండుసార్లైనా పెసరట్టు చేసుకుని తీసుకోవాలని న్యూట్రీషియన్లు అంటున్నారు.

Tags :
|
|
|

Advertisement