Advertisement

  • వాటర్ బాటిల్ సరిగా వాడకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు

వాటర్ బాటిల్ సరిగా వాడకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు

By: Sankar Fri, 19 June 2020 6:18 PM

వాటర్ బాటిల్ సరిగా వాడకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు



ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం మనిషి ఎక్కడికి వెళ్లిన అతడి వెంట ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లడం తప్పనిసరి అయింది ..అయితే వాటర్ బాటిల్ సరిగా వాడకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసా ..కేవలం ప్లాస్టిక్ బాటిళ్లే కాదు, మీరు వాడే ఏ బాటిలైనా సరే సరిగా వాడకపోతే ముప్పు తప్పదు. వాటర్ బాటిళ్లు శుభ్రంగా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాటర్ బాటిళ్లపై ఉండే తేమ వల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది.

మీ బాటిళ్లకు క్యాప్ లేదా, స్ట్రా ఉన్నట్లయితే తప్పకుండా బాగా క్లీన్ చేయాలి.

వాటర్ బాటిళ్లలో ఉండే ఇ-కోలి వంటి బ్యాక్టీరియా వల్ల గ్యాస్ట్రో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండాలంటే మీ వాటర్బాటిళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.

పాత్రలను శుభ్రం చేసే లిక్విడ్లు లేదా వేడి నీటితో బాటిళ్లను శుభ్రం చేయడం మంచిది.

సీసాలో సర్ఫ్ నీరు నింపి.. బ్రష్ సాయంతో మూలలు, అడుగు భాగాన్ని శుభ్రం చేయండి.

సబ్బు లేదా సర్ఫ్ నీరు బాటిల్‌ నుంచి పూర్తిగా తొలగిపోయేలా నీటితో కడగండి.

బాటిల్‌లో నీరు మొత్తం ఇంకేలా బాటిల్‌ను బోర్లించండి. లేదా ఏదైనా శుభ్రమైన క్లాత్‌తో బాటిల్‌ లోపల తడి లేకుండా తుడవండి.


Tags :
|
|
|

Advertisement