Advertisement

  • మొలకెత్తిన గింజలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

మొలకెత్తిన గింజలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

By: Sankar Mon, 20 July 2020 07:33 AM

మొలకెత్తిన గింజలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..



రోజు గుప్పెడు మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు ఎప్పుడు చెపుతుంటారు ..కానీ చాల మంది మాత్రం మొలకెత్తిన గింజలు తినడానికి అంత ఆసక్తిని చూయించారు..అయితే ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి ..

1. మొలకల్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. కనుక శరీరంలో వ్యర్థాలు బయటికి పోతాయి. అన్ని వయసుల వారికి ఈ ఆహారం అంతా మంచే చేస్తుంది.

2. బరువు తగ్గాలనుకునే వారికి మొలకెత్తిన గింజలు మంచి ఆహారం. ఇందులో పీచు పుష్కలంగా లభిస్తుంది. అది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దాని వల్ల ఆహారం బాగా అరుగుతుంది. అజీర్తి సమస్య దూరం అవుతుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. క్రమంగా బరువు తగ్గచ్చు.

3.మహిళల్లో ఉన్న హార్మోన్ల అసమతుల్యతను మొలకెత్తిన గింజల్లోని పోషకాలు దూరం చేస్తాయి. హార్లోన్ల సమస్యలు తలెత్తెకుండా ఉండేందుకు మహిళలు తప్పకుండా రోజూ మొలకలు తినడం అలవాటు చేసుకోవాలి.

4. మెదడుకు రక్తం చక్కగా సరఫరా అవ్వడం చాలా ముఖ్యం. మొలకల్లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తం చక్కగా సరఫరా అయ్యేలా అందులోని పోషకాలు సహకరిస్తాయి. ఒత్తిడి తగ్గించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.

5.మొలకల్లో జింక్, ఇనుము, క్యాల్షియం వంటివి అధికంగా లభిస్తాయి. ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే శరీరంలో ఆరోగ్యంగా ఉంటుంది. ఆ పోషకాలు ప్రాణవాయువును శరీరంలో సక్రమంగా అన్ని శరీర భాగాలకి చేరేలా చేస్తాయి.

Tags :
|

Advertisement