Advertisement

సీజనల్ ఫ్రూట్ జామపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు

By: chandrasekar Wed, 01 July 2020 10:31 AM

సీజనల్ ఫ్రూట్ జామపండ్ల ఆరోగ్య ప్రయోజనాలు


సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ వాటిని తినడం వలన జలుబు చేస్తుంది, వేడి చేస్తుంది అని చాలా మంది అపోహ పడుతుంటారు. వీటిని తినడం వల్ల శరీరానికి అనేక మేలు జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతారు. అందుకే ఆయా సీజన్స్‌కి సంబంధించిన పండ్లు మార్కెట్లో లభిస్తాయి. రెగ్యులర్‌గా వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆ సీజన్‌లో వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే పండ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్‌లో ఎక్కువగా మనకి జామపండ్లు అందుబాటులో ఉంటాయి.

ఎక్కువగా కాచే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇప్పుడైతే మార్కెట్లో ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ, పూర్వ కాలంలో అయితే అందరి ఇళ్ళల్లో ఈ చెట్లు ఉండేవి. ఊరికే ప్రతి ఒక్కరూ ఈ పండ్లని అడిగి తీసుకుని తినేవారు. ఇప్పుడు సిటీల్లో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయినా సరే మిగతా పండ్లతో పోలిస్తే వీటి రేట్లు తక్కువనే చెప్పాలి. దీంతో చాలా మంది కొనేందుకు, తినేందుకు ఆసక్తి చూపిస్తారు. తక్కువ ధరకే ఇవి లభించినా.. వీటితో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. అందుకే తీసుకుంటారు.

వర్షాకాలంలో ఎక్కువగా లభించే వీటిని తినడం వల్ల జలుబు చేస్తుందని అంటారు. ఇది నిజమేనా అసలే కరోనా టైమ్ జలుబు, జ్వరాలు అంటే అంతా భయపడతారు. అందుకే వీటిని దూరం పెడుతుంటారు. అలా కాకుండా నిజంగా ఈ పండ్లని తినడం వల్ల జలుబు చేస్తుందా అంటే అందులో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు.

health,benefits,of seasonal,fruit,guava ,సీజనల్, ఫ్రూట్, జామపండ్ల, ఆరోగ్య,  ప్రయోజనాలు


సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకానీ, జలుబు చేస్తుందని అపోహలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. కానీ, కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. అలాంటి వారికి కాస్తా సమస్య వస్తుంది. మిగతావారు హ్యాపీగా తినొచ్చు. ఈకాలంలో ఎక్కువగా నిమ్మ, జామ, ఉసిరి కాయలు తినడం చాలా మంచిది.

వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అంతేకానీ, ఏవేవో కారణాలు చెప్పి ఈ ఆరోగ్య ఫలాలని దూరం చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనకి ప్రకృతి ప్రసాదం వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా జామపండ్లు తినడం వల్ల నోటి సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుబాటులో వీటిని తినడం వల్ల ఎన్నో రకాల మేలు జరుగుతాయి. హ్యాపీగా తినడం మంచిది.

Tags :
|
|

Advertisement