రాగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
By: Sankar Wed, 15 July 2020 12:12 PM
రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం మరియు ఒక మంచి ఆరోగ్య నిర్వహణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
1. రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది..
2. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
3. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
4. రాగులు కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.
5. రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది
6. మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్నంధించే టానిక్ వంటింది.
7. కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి