Advertisement

బ్రేక్ ఫాస్ట్ వలన కలిగే ఉపయోగాలు

By: Sankar Thu, 25 June 2020 3:50 PM

బ్రేక్ ఫాస్ట్ వలన కలిగే ఉపయోగాలు



అల్పాహారం ..సామాన్యంగా ఎక్కువగా మధ్య తరగతి మరియు పేదవాళ్ళు ఉండే మన దేశంలో దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వరు ..పొద్దునే లేచి పనులకు వెళ్లే అనేకమంది సామాన్య ప్రజలు ఐది ఉంటె అది తిని వెళ్తారు లేదా ఒకేసారి మధ్యాహ్నం తింటారు కానీ ఇలా చేయడం చాల తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ..పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఎంత మంచిగా తీసుకుంటే మన శరీరం కూడా రోజు అంత ఎటువంటి ఇబ్బంది లేకుంట ఉంటుంది ..మరి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వాళ్ళ వచ్చే లాభాలు ఏంటో చూదాం

ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల కలిగే ముఖ్య లాభం ఏంటంటే.. శరీర బరువు అదుపులో ఉంటుంది.. ఎందుకంటే.. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల ఏ ఫుడ్‌మీదకి మనసు మళ్లదు.. వేరే ఫుడ్ తినం.. దీంతో పాటు.. ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగి ఎక్కువగా భోజనం చేస్తాం.. దీంతో బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది..

మెదడు చురుగ్గా పనిచేసేందుకు కూడా బ్రేక్ ఫాస్ట్ హెల్ప్ చేస్తుంది.. మనం తీసుకునే ఆహారం వల్లే మెదడుకి గ్లూకోజ్ అందుతుంది.. అప్పుడే మనం ఏ పనైనా సరిగ్గా చేయగలం.. మనం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు. చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. మతిమరుపు వంటి సమస్యలు కూడా రావు.

మనం రోజు సామాన్యంగా మూడు పూటలా తింటాము అయితే మధ్యాహ్నం , రాత్రి తినే దానికన్నా పొద్దున్నమనం తినే బ్రేక్ ఫాస్ట్ మన శరీరానికి ఉత్తేజాన్ని , ఉల్లాసాన్ని ఇస్తుంది ..రోజంతా ఎటువంటి ఇబ్బంది లేకుంట పని చేయడానికి దోహద పడుతుంది ..మంచి బ్రేక్ ఫాస్ట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే, కొవ్వు శాతం తక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే షుగర్ వ్యాధి రాదని చెబుతున్నారు నిపుణులు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని చెబుతున్నారు.

ఇవి కాకా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల అనేక లాభలు ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పోదునా బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతనే తమ యొక్క రోజును మొదలు పెట్టాలి అని నిపుణులు సూచిస్తున్నారు



Tags :
|

Advertisement