Advertisement

ఇమ్మ్యూనిటి పెంచడానికి అద్భుతమైన ఔషధం అల్లం

By: chandrasekar Thu, 18 June 2020 7:47 PM

ఇమ్మ్యూనిటి పెంచడానికి అద్భుతమైన ఔషధం అల్లం


కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రోజు ఉదయం అల్లం తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చాలా మంది బరువు తగ్గడం కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అల్లం బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతోంది. ఆకలిని తగ్గిస్తుంది. జలుబు, దగ్గుకు అల్లం మంచి ఔషదంలా పనిచేస్తోంది. గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడాని ఎంతో సహాయపడుతోంది. మధుమేహం ఉన్న వాళ్లు తప్పకుండా అల్లం తీసుకోవాలి. ఈలా చేయడం వల్ల శరీరంలోని చక్కెర శాతం తగ్గుతోంది.

అల్లం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే అల్లం టీ తాగితే అనారోగ్యం దరి చేరదు. లేదా పచ్చి అల్లం నమిలినా తేనెలో కలిపి తిన్న ఆరోగ్యానికి అనేక మేలు చేకూరుతుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా రోజువారీ డైట్‌లో చేర్చుకుంటారు.

* చాలామందికి ఉదయం లేవగానే వికారం, వాంతి వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యనే పైత్యం అని కూడా అంటారు. అలా బాధపడేవారు రోజూ అల్లం టీని తాగితే సమస్య తగ్గుతుంది. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

* ఆర్థరైటీస్ వ్యాధిగ్రస్తులకు అద్భుత వరం. నొప్పి ఉపశమనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా అల్లంలోని గొప్ప గుణాలు ఆర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.

* గుండె సమస్యలను నివారిస్తుంది. మరీ ముఖ్యంగా అల్లం రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కూడా చాలా వరకూ తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా మంచిది.

* ఆడవారిలో వచ్చే నెలసరి సమస్యలకు అల్లం చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. పీరియడ్స్‌ ఓ 4 రోజుల ముందు నుంచే అల్లం నిమ్మరసంతో కలిపి తీసికోవడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలావరకూ దూరమవుతాయి. రక్తసరఫరా కూడా కూడా మెరుగవుతుంది.

ginger,excellent,medicine,to boost,immunity ,ఇమ్మ్యూనిటి, పెంచడానికి, అద్భుతమైన, ఔషధం, అల్లం


* వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి వారికి అల్లంని టీ లో కలిపి రెగ్యులర్‌గా తాగితే జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి.

* అల్లంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి అలర్జీ సమస్యలను దూరం చేస్తాయి. ఈ కారణంగా ఆస్తమా కూడా తగ్గుతుంది. జింజరాల్స్, జింజెరాన్‌లు అనే ప్రత్యేక గుణాలు కలిగిన అల్లం రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులని తొలగిస్తుంది.

* టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి షుగర్ లెవల్స్ తగ్గించడంలో అల్లంటీ భేషుగ్గా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది.

* జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అసిడిటీ, పొట్టలో మంట వంటి సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ కారణంగా మలబద్ధకం కూడా దూరమవుతుంది.

* రోగ నిరోధక శక్తిని పెంచడంలో జింజర్ బాగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆ సమయంలోనే ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇన్ఫెక్షన్లను అడ్డుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.

* అధికబరువు సమస్యతో బాధపడేవారు రెగ్యులర్‌గా వేడి నీళ్లలో అల్లం, నిమ్మ రసం మరియు తేనె కలిపి త్రాగడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. అల్లంలోని ప్రత్యేక గుణాలు జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. ఈ కారణంగా శరీరంలోని కొవ్వు లాంటి పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి త్వరలోనే అధికబరువు అదుపులోకి వస్తుంది.

* మగవారిలో లైంగిక సమస్యలను కూడా అల్లం దూరం చేస్తుంది. దీన్ని శృంగారానికి ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags :
|

Advertisement