Advertisement

గేగులు ఆరోగ్యానికి చేసే మేలు

By: chandrasekar Fri, 17 July 2020 6:22 PM

గేగులు ఆరోగ్యానికి చేసే మేలు


గేగులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఒమెగా-3 పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, విటమిన్‌ బి, బి1, బి3, సి వంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

గేగుల్లోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ గేగుల్ని తీసుకునేవారికి పెద్ద పేగుల్లో మలినాలు చేరవు.

ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఫాస్పరస్‌ శరీరానికి దృఢత్వాన్నిస్తుంది. వీటిని పాలల్లో ఉడికించి ఆ మిశ్రమాన్ని చర్మానికి పూతలా వేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

రోజుకు రెండు గేగులు తీసుకుంటే శరీరంలోని కొవ్వుసైతం కరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో గేగులు తినడం వల్ల చెమటకాయలు రావు.

గేగుల్ని బాగా నమలితింటే నోటి పూత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Tags :
|
|
|
|

Advertisement