Advertisement

  • గుడ్లు , టొమాటోలు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి..

గుడ్లు , టొమాటోలు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి..

By: Sankar Sun, 27 Sept 2020 07:31 AM

గుడ్లు , టొమాటోలు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి..


కూరగాయలు తాజాగా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అందుకే చాలా మంది ఒకేసారి ఎక్కువ రోజులకి కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులు తాజాగా ఉంటాయి.

అందుకే ఒకటేసారి ఎక్కువ పరిమాణంలో కూరగాయల్ని తెచ్చుకుని ఫ్రిజ్‌ని నింపేస్తాం. ఇది మనకి సౌలభ్యంగానే ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయో చెబుతున్నారు నిపుణులు. ఇది అంతగా మంచిది కాదు అని.. గది ఉష్ణోగ్రతలోనే కోడిగుడ్లు, టమోటాలను నిల్వ చేయాలని చెబుతున్నారు.

గుడ్లని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లోపలి భాగం పాడైపోయి పై పెంకుపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీంతో అవి ఉడికిన అంతగా రుచిగా ఉండవు. ఈ విషయాన్ని మీరు కావాలంటే గమనించొచ్చు. వీటిని మీరు తిన్న అంతగా రుచి ఉండవు. అది మీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని టమోటాలు, గుడ్లని ఫ్రిజ్‌లో పెట్టొద్దని చెబుతున్నారు.

ఇక ఫ్రిజ్‌లో టమోటాలు పెడితే అవి గట్టిగా అయిపోతాయని.. వాటి సహజ రుచిని కోల్పోతాయి.. ఈ విషయం మీరు గమనించే ఉంటారు. మామూలుగా గది ఉష్ణోగ్రతలో ఉన్న టమోటాల కంటే ఫ్రిజ్‌లో పెట్టిన టమోటాలు అంతగా రుచిగా ఉండవు.. వీటితో కూర చేసినా.. ఏం చేసినా అంతగా రుచిగా ఉండవు. పైగా వీటిని తింటే ఓ రకమైన పుల్లని రుచి వస్తుంది. ఇది కేవలం రుచి మాత్రమే కాదు.. అనారోగ్యానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.


Tags :
|

Advertisement