Advertisement

చేపల తింటే ఆరోగ్యానికి కలిగే మేలు

By: chandrasekar Thu, 21 May 2020 6:24 PM

చేపల తింటే ఆరోగ్యానికి కలిగే మేలు


చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. వీటిల్లో 20 శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. వీటి ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిలో ముఖ్యంగా లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల రకాలను బట్టి, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు ఉపయోగపడుతుంది. దీనివల్ల తొమ్మిది నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, , కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి.

fish,healthy,benefits,eating,omega ,చేపల, తింటే, ఆరోగ్యానికి, కలిగే మేలు, జీర్ణమవుతాయి


ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చేపలలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు బాగావుపయగపడుతుంది. ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది.

fish,healthy,benefits,eating,omega ,చేపల, తింటే, ఆరోగ్యానికి, కలిగే మేలు, జీర్ణమవుతాయి


చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి. కానీ ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది.

Tags :
|
|

Advertisement