Advertisement

  • మీ పిల్లలు వీడియో గేమ్స్ కి అడిక్ట్ కాకుండా చుడండి

మీ పిల్లలు వీడియో గేమ్స్ కి అడిక్ట్ కాకుండా చుడండి

By: chandrasekar Fri, 03 July 2020 2:42 PM

మీ పిల్లలు వీడియో గేమ్స్ కి అడిక్ట్ కాకుండా చుడండి


వీడియో గేమ్స్ లాంటి క్విక్ ఎంటర్టెయిన్మెంట్ మీద టైమ్ స్పెండ్ చేసే పిల్లలు ఆ తర్వాత దేని మీద శ్రద్ధ పెట్టలేనివారుగా తయారవుతారు. మనం చెప్పేది వాళ్ళు త్వరగా అర్ధం చేసుకోలేరు కూడా. పైగా దీని వల్ల యాంగ్జైటీ, నలుగురిలో కలవలేకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

అయితే, ఒక పేరెంట్‌గా మీ బాధ్యత అతనికి పూర్తిగా గేమ్స్ అందకుండా చేయడం కాదు. ఇన్‌డోర్ గేమ్స కీ, ఔట్ డోర్ గేమ్స్‌కీ బాలెన్స్ చేసుకోడానికి హెల్ప్ చేయడం. అప్పుడే వాళ్ళు హెల్దీగా పెరుగుతారు. ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూ ఉండడం మంచిది కాకపోయినా, ఈ సమస్య ముందు నుంచి ఉందా, లాక్ డౌన్ వల్ల ఏం చేయాలో తెలియక ఈ పని చేస్తున్నాడా అన్న విషయం మీరు గమనించాలి.

ఈ మధ్యే ఇలా జరిగింది అంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి, ఫ్రెండ్స్‌ని కలవడానికి ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోవచ్చు. మీరు కొంచెం సహనంగా ఉండి ఈ కింద టిప్స్ పాటిస్తే మీ సమస్య చాలావరకూ పరిష్కారమవ్వచ్చు.

మీ పిల్లలను రకరకాల ఇన్‌డోర్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయండి. బోర్డ్ గేమ్స్ ఆడడం, మ్యూజిక్ వినడం, వంటలో సాయం చేయడం ఏదైనా సరే. దీని వల్ల మీకూ, మీ అబ్బాయికీ మధ్య కన్వర్జేషన్ పెరుగుతుంది.

వాళ్ళు రోజుకి ఎంత సమయం గేమ్స్ ఆడుకోవచ్చో ఒక టైమ్ చెప్పండి. ఇది మరీ ఎక్కువగా, లేదా మరి తక్కువగా ఉండకుండా చూసుకోండి. వీకెండ్స్‌లో ఇంకొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. మీరు చెప్పిన టైమ్‌ని ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి.

ఇంటి పనుల్లో సాయం చేసినప్పుడల్లా వాళ్లకి నచ్చిన పని ఒకటి చేయండి. వీలున్నంత వరకూ ఇవి డబ్బుతో ముడిపడి ఉండకుండా చూసుకోండి. అతనికి ఇష్టమైన కూర చేసిపెట్టడమో, వాళ్లతో కలిసి బట్టల బీరువా సర్ది పెట్టడమో ఇలాంటివి ట్రై చేయండి.

మీ పిల్లలకి ఇంతవరకూ రీడింగ్ హాబిట్ లేకపోతే అలవాటు చేయండి. లేదా, అతనికి నచ్చిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కొనిపెట్టి ఆన్లైన్ క్లాసెస్ లో ఎన్‌రోల్ చేయండి.

వాళ్ళ ఫ్రెండ్స్‌తో, కజిన్స్‌తో కబుర్లు చెప్పుకోడానికి ఎంకరేజ్ చేయండి. మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు చాలా చిరాకులు వాటంతటవే తగ్గిపోతాయి.

ఇవేవీ పని చేయక, పరిస్థితి చేయి దాటిపోతోంది అనుకుంటే థెరపిస్ట్‌ని గానీ, మీ పీడియాట్రీషియన్‌ని కానీ సంప్రదించండి. అప్పుడు సమస్య ఇంకా తీవ్రతరం కాకుండా చూడవచ్చు.

Tags :

Advertisement