Advertisement

ఈ సందర్భాలలో అరటిపండు తినరాదు ...

By: Sankar Thu, 25 June 2020 3:42 PM

ఈ సందర్భాలలో అరటిపండు తినరాదు ...



అరటిపండు సీజన్తో సంబంధం లేకుండా అందరికి అన్నివేళలా అందుబాటులో ఉంటుంది..ధరలు కూడా మిగతా పండ్లతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరు అరటిపండును తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటారు ..ఆకలి అయినపుడు ఒక అరటి పండు తింటే అది తక్షణ శక్తిని అందిస్తుంది.. ఇంకా అందులో ఉంటె పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుంది. దీంతో పాటు.. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండును కచ్చితంగా నెలరోజులు తింటే.. ఆ సమస్య తగ్గుతుంది

అరటి పండులో ఉండే అనేక పోషకాలు మన శరీరానికి ఎనర్జీని ఇస్తాయి.. అందుకే క్రీడాకారులు మ్యాచ్ ల మధ్యలో ఎక్కువగా ఆరాట పండ్లు తింటూ ఉండటం మనం చూస్తూ ఉంటాము ..మరి ఇంత పోషకాలు ఉన్న అరటి పండును ఎలా తినాలి , అన్నివేళలా దీనిని తినొచ్చా అంటే కొన్ని సమయాలలో మాత్రం తినొద్దు అని నిపుణులు చెప్తున్నారు ..

ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే అరటిపండు తింటే ఏమవుతుందంటే.. ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడుతుందని.. దీని వల్ల జలుబు అవుతుందని.. అది చాలా వరకు తగ్గదని చెబుతున్నారు. అయితే, మధ్యాహ్న సమయంలో తిన్న వెంటనే తీసుకుంటే మంచిదేని చెబుతున్నారు. అదే విధంగా.. కొంతమంది ఖాళీ కడుపుతో పరగడుపునే ఈ పండుని తింటారు. ఇది కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయని.. ఆ తర్వాత వెంటనే అలసటగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి అరటిపండు తినేటప్పుడు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement