Advertisement

అతిగా ఉప్పు తినడం వలన కలిగే అనర్ధాలు

By: Sankar Tue, 07 July 2020 6:31 PM

అతిగా ఉప్పు తినడం వలన కలిగే అనర్ధాలు



ఉప్పు లేకుండా ఏ వంటకాన్ని అయినా ఊహించుకోవడం చాల కష్టం ..ఎన్ని పదార్ధాలు వేసిన వంటల్లో సరిగ్గా ఉప్పు వేస్తే ఆ వంటకు వచ్చే టేస్ట్ వేరు ..అందుకే వంటల్లో ఉప్పు అంత ప్రాధాన్యతను సంతరించుకుంది ..ఆలా అని అతిగా ఉప్పు వాడటం కూడా ప్రమాదమే ..అయితే అతిగా ఉప్పు వాడటం వలన వచ్చే అనర్ధాలు ఏంటో చూదాం ..

1. శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటే.. రాత్రిపూట సరిగా నిద్రపట్టదు.
తరచు మూత్రం వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళలు, వయస్సు పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

2. ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్రం వస్తుంటుంది.

3. ఉప్పు తినడం తగ్గిస్తే రాత్రి లేచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తాజా పరిశోధనలో తేలింది.

4. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు అధికమవుతుంది.

5. లో బీపీ ఉన్న వారు పగలు తీసుకునే ఆహారంలోనే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుని తినాలి. రాత్రిళ్లు తక్కువ ఉప్పు తినడం మంచిది.

6. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరం. అలాగని మోతాదుకు మించి తీసుకోకూడదు.


Tags :
|
|
|

Advertisement