Advertisement

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీల‌క‌ర్ర

By: chandrasekar Tue, 23 June 2020 7:16 PM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీల‌క‌ర్ర


మనము రోజు వాడే జీల‌క‌ర్ర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించడంలో ముఖ్య పాత్రా పోషిస్తుంది. జీల‌క‌ర్ర వంట‌లకు రుచిని చేకూర్చ‌డ‌మే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్ర‌సాదిస్తుంది. అంతేకాదు జీల‌క‌ర్ర నీరు కూడా ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంతో తోడ్ప‌డుతుంది అంటున్నారు నిపుణులు. జీల‌క‌ర్ర నీరు తాగ‌డం వ‌ల్ల ఎవ‌రికి ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు చూద్దాం.

* ఒక గ్లాసు నిండా నీరు తీసుకోవాలి. అందులో రెండు టీస్పూన్ల జీల‌క‌ర్ర క‌ల‌పాలి. ఇప్పుడు వీటిని గంట‌పాటు నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత జీలక‌ర్ర నీటిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.

* జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయి. జీలకర్ర వేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది మరియు వేడి తగ్గిస్తుంది.

* జీలకర్ర నీరు తాగడం వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా కిడ్నీ రాళ్ల సమస్య దూరం అవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు దూరం అవుతాయి.

* ఒక్కోసారి ఒత్తిడికి గుర‌వుతుంటారు. అలాంటప్పుడు జీలకర్రని నీటిలో మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలిపి టీలా తీసుకుని చూడండి క్షణాల్లో సమస్య దూరం అవుతుంది.

* షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. అందుకే త‌ర‌చుగా వీటిని తాగుతుండాలి.

* అంతేకాదు, జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

Tags :
|
|
|

Advertisement