Advertisement

కంటి చూపును మెరుగుపరిచే క్యారెట్ జ్యూస్

By: chandrasekar Tue, 26 May 2020 6:39 PM

కంటి చూపును మెరుగుపరిచే క్యారెట్ జ్యూస్


క్యారెట్‌ను ప్రతిరోజూ జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు సరైన దిశలో అందుతాయి. క్యారెట్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుచుటకు దోహదపడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో మంచిగా దోహదపడుతుంది. ఈ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.

హైబీపీని అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుతుంది. ధూమపానం చేసే వారు క్యారెట్ జ్యూస్‌ను ప్రతిరోజూ తీసుకుంటే ధుమాపానం వలన కలిగే దుష్పరిణామాల నుండి తప్పించుకోవచ్చును. ఈ క్యారెట్స్‌లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై ఉండే మచ్చలు, మెుటిమలు తొలగించుటలో సహాయపడుతాయి.

క్యారెట్లలో విటమిన్ బి6, కె, పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అసిడిటీని తగ్గించడంలో క్యారెట్ జ్యూస్ మెరుగ్గా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతాయి. వీటిపై ఒత్తిడి తగ్గుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించుటలో క్యారెట్స్ చాలా ఉపయోగపడుతాయి.

carrot,juice,that,improves,eyesight ,కంటి చూపును మెరుగుపరిచే క్యారెట్ జ్యూస్


క్యారట్ లాలాజలం పెంచడానికి మరియు జీర్ణక్రియకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్ లను సరఫరా చేస్తుంది. క్యారెట్లను క్రమం తప్పకుండా తింటే గ్యాస్ట్రిక్ అల్సర్ మరియు ఇతర జీర్ణ లోపాలను నిరోధించడానికి సహాయపడుతుంది. క్యారెటట్ లో కెరోటిన్ అనే కంటెంట్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి పవర్ ను పెంచుతుంది. మాస్కులర్ డీజనరేషన్ మరియు సెనిల్ కాంటరాక్ట్స్ ను నివారిస్తుంది.

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మం, జుట్టులో ఎక్సెసివ్ డ్రైనెస్ పెరుగుతుంది. క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం రాకుండా చేస్తుంది. వాటిలోని సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

carrot,juice,that,improves,eyesight ,కంటి చూపును మెరుగుపరిచే క్యారెట్ జ్యూస్


క్యారెట్ లో ఉండే సోడియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది. పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా క్యారెట్ తినడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యారట్ లో ఆల్కలీన్ అంశాలు పుష్కలంగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేసి మరియు పునరుద్ధరించటానికి సహాయపడుతుంది. క్యారట్ లో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను ఆరోగ్యకరంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి.

క్యారెట్ ను తినడం దాని రసం తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. నోటిలో హానికరమైన క్రిములను చంపడానికి మరియు దంత క్షయాన్ని నిరోధించడానికి క్యారట్ సహాయపడుతుంది.

Tags :
|
|
|

Advertisement