Advertisement

  • పల్లీపట్టీలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పల్లీపట్టీలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Sat, 25 July 2020 3:02 PM

పల్లీపట్టీలు  తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు



బెల్లం , పల్లిలు తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి ..అసలే ఒకవైపు కరోనా , మరోవైపు వానలు విజృంభిస్తున్న వేళ బలవర్ధకమైన ఆహారం తినాలి ..ముఖ్యంగా వొంట్లో వేడి తగ్గాలి అంటే పల్లీలు బెల్లం తో చేసిన పల్లీపట్టీలు తింటే అటు ఆరోగ్యానికి ఆరోగ్యం , రుచికి రుచి ఉంటుంది ..పల్లి పట్టిలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ..

1. బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. బెల్లంతో కలిపి వీటిని తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది. పల్లీలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

2. షుగర్ పేషెంట్లు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తింటే శరీరానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. చలికాలంలో బెల్లం, వేరుశనగ కలిపి తింటే బోలెడు ప్రయోజనాలుంటాయి.

3. బెల్లం, వేరుశనగలను తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా తినొద్దు.

4. పల్లీ ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. దీంతో మీ ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. వేరుశనగలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి.

5. బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. కాబట్టి ఏం చక్కా పల్లీ చక్కీలను తినేయండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. డాక్టర్ వద్దంటే మాత్రం వీటి జోలికి వెళ్లకండి.



Tags :
|
|

Advertisement