Advertisement

  • అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది

By: chandrasekar Mon, 07 Sept 2020 5:33 PM

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది


ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి కల్యాణోత్సవ రథం పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇది షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే విషయం పై పోలీసులు విచారణ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో కూడా గతంలో ఇలాంటి సంఘటన జరిగిందని, మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అప్పట్లో రథానికి నిప్పు పెట్టాడని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని 62 ఏండ్ల క్రితం పూర్తిగా టేకు కలపతో తయారుచేశారు. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన రథం కాలిపోవడం రాష్ట్రానికి అరిష్టమని, బీజేపీ, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదేశించారు.

Tags :

Advertisement