Advertisement

  • మధుమేహనికి విటమిన్లు మరియు పీచు పదార్థం అధికంగా వున్న పండ్లు చేసే మేలు

మధుమేహనికి విటమిన్లు మరియు పీచు పదార్థం అధికంగా వున్న పండ్లు చేసే మేలు

By: chandrasekar Thu, 11 June 2020 8:26 PM

మధుమేహనికి  విటమిన్లు మరియు పీచు పదార్థం అధికంగా వున్న పండ్లు చేసే మేలు


కూరగాయలతో పోలిస్తే శరీరానికి అవసరమైన లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం పండ్ల ద్వారానే ఎక్కువగా లభిస్తాయి. అయితే, వీటిలో కార్పోహైడ్రేట్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మధుమేహ రోగులు ఏ పండ్లు ఎక్కువగా తినవచ్చో తెలుసుకుందాం.

జామకాయ: ఇది డయాబెటిస్ కు మంచి ఔషదం. ఇది అధిక మొత్తంలో ఫైబర్లను కలిగి ఉండి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

నేరేడు: నేరేడు పండ్లు రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. నేరేడు పండులోని గింజల్ని పొడి చేసి రోజూ తీసుకున్నా షుగర్ నియంత్రణలోకి వస్తుంది.

బొప్పాయి: ఇందులో హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి డయాబెటిస్ రోగులను రక్షించే ఎంజైములు ఉంటాయి. బొప్పాయిలో ఉండే ప్లెతోరా న్యూట్రియంట్స్ మధుమేహాన్ని నివారిస్తాయి. డయాబెటిస్ వల్ల ఏర్పడే గుండె సమస్యలను అడ్డుకుంటాయి.

దానిమ్మ: రక్తంలోని చక్కెరను నియంత్రించే శక్తి దానిమ్మలో ఉంది. ఫ్రక్టోజ్‌, పీచు పదార్థంలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ను బాగా తగ్గించే గుణం ఉంది.

a fruit,rich in,vitamins,and fiber,is good for diabetics ,మధుమేహనికి , విటమిన్లు, మరియు పీచు, పదార్థం అధికంగా, వున్న పండ్లు చేసే మేలు


యాపిల్‌: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్ కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

అంజీర: ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్‌ సక్రమంగా పనిచేసేందుకు ఇది తోడ్పడుతోంది.

చెర్రీస్‌: వీటిలో ఉండే విటమిన్ సి, ఐరన్, బీటా కెరోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఆంథోసియానిన్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని 50 శాతానికి పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

బెర్రీస్‌: రాస్‌ బెర్రీస్, స్ట్రాబెర్రీస్‌, బ్లాక్ బెర్రీస్, క్రాన్‌ బెర్రీస్‌ షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. రక్తంలోని చక్కర నిల్వలను ఇవి క్రమబద్ధీకరిస్తాయి.

Tags :

Advertisement