Advertisement

  • ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 7 ప్రత్యేకమైన దినోత్సవాలు

ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 7 ప్రత్యేకమైన దినోత్సవాలు

By: chandrasekar Mon, 22 June 2020 2:25 PM

ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు 7 ప్రత్యేకమైన దినోత్సవాలు


ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలలో ఒకటి లేదా రెండు మూడు ప్రత్యేక దినోత్సవాలు ఇప్పటి దాకా చూస్తున్నాం. కానీ ఒకే రోజు 7 ప్రత్యేకమైన దినోత్సవాలు నిర్వహించుకోనున్నారు. అదే నేటి ఆదివారం. అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జూన్‌ 21న ఇంటర్నేషనల్‌ యోగా డేగా చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఏడాది మొత్తం మీద పగటి పూట ఎక్కువగా ఉండే జూన్‌ 20, 21, 22 తేదీల్లో మాత్రమే. ఈమూడు రోజుల మధ్య రోజైన జూన్‌ 21ను యోగా డేగా మోడీ ఎంపిక చేశారు.

ఫాదర్స్‌ డే ప్రతి ఏటా జూన్‌ 3 ఆదివారం నాన్నల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మూడో ఆదివారం జూన్‌ 21న వచ్చింది. కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే తండ్రిని గౌరవించుకునేందుకు ఈ ఫాదర్స్‌ డే చేసుకుంటారు. తన సంతోషాలను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడే నాన్న విలువను గురించి చెబుతూ ఫాదర్స్‌ డే చేసుకుంటారు.

మనుషులలో మానవత్వాన్ని పెంచేలా 1980 నుంచి మానవతావాది దినోత్సవం కొనసాగుతున్నది. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని చేసుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం పెంపొందించేందుకు స్ఫూర్తినిచ్చేది ఈరోజు.

జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడి ఉండేలా చేసేందుకు హైడ్రో గ్రఫీ డే 2005 జూన్‌ 21వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఐరాస కూడా దీన్ని గుర్తించింది. హైడ్రోగ్రఫీ అంటే జన వనరుల భౌతిక స్వరూపాల కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు చిత్రాలు సరస్సులు ఇతర జలాశయాలను అన్ని రంగాల అభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది.

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో 1982లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని చేసుకుంటున్నాయి. ఫ్రాన్స్‌ సాంస్కృతిక మంత్రి జాక్‌ లాంగ్‌, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లూ హెమోవిస్‌ మ్యూజిక్‌ డేను ప్రారంభించారు. ఈ రోజున బహిరంగ ప్రదేశాల్లో తమ వాయిద్య పరికరాలతో సంగీతాన్ని వినిపిస్తుంటారు కళాకారులు.

ఇదే రోజు షేక్‌ హ్యాండ్‌ డే కూడా. కానీ, ప్రస్తుతం కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ ఏడాది కరచాలనం దినోత్సవం జరిగేలా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఆరో గ్యం ముఖ్యం కదా అందుకే ఒకరికొకరు నమస్కరించుకోవడం ఉత్తమం.

టీ షర్ట్స్‌ డే వల్ల సమాజానికి ఎటువంటి శ్రేయస్సు లేకపోయినా 2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. జర్మనీలోని ఫ్యాషన్‌ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్స్‌ డే ను ఏర్పాటు చేశారు.

Tags :
|
|

Advertisement