Advertisement

  • హోమ్‌ క్వారంటైన్ లో ఉంటున్నపేషెంట్ల చికిత్సను గాలికి వదిలేసిన అధికారులు

హోమ్‌ క్వారంటైన్ లో ఉంటున్నపేషెంట్ల చికిత్సను గాలికి వదిలేసిన అధికారులు

By: chandrasekar Wed, 24 June 2020 12:23 PM

హోమ్‌ క్వారంటైన్ లో ఉంటున్నపేషెంట్ల చికిత్సను గాలికి వదిలేసిన అధికారులు


రాష్ట్ర ప్రభుత్వం హోమ్‌ క్వారంటైన్ లో ఉంటున్నపేషెంట్ల చికిత్సను గాలికి వదిలేసింది. వాళ్లకు సరైన ట్రీట్ మెంట్ అందించటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దిల్‌‌సుఖ్‌నగర్‌‌‌‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌‌కు ఇటీవల వైరస్ పాజిటివ్ వచ్చింది. హోమ్‌ ఐసోలేషన్ లో ఉంటున్నఅతనికి రోజూ రెండు సార్లు కాల్స్ వస్తున్నాయి. ‘మందులు వేసుకున్నరా? సింప్టమ్స్ ఉన్నయా? అని అడిగి ఫోన్ పెట్టేస్తున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని వాళ్లకు కూడా టెస్టులు చేయించాలని కోరితే, అది మా డ్యూటీ కాదండీ అంటూ కాల్ కట్ చేస్తున్నారు’ అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

వైరస్ పాజిటివ్ వచ్చిన తర్వాత 3 రోజుల వరకూ తనను ఎవరూ పట్టించుకోలేదని ఉప్పల్‌‌కు చెందిన మరో వ్యక్తి తెలిపారు. తనకు తెలిసిన అధికారులకు కాల్ చేసినా రెస్పాన్స్ లేదని, చివరకు హెల్త్ మినిస్టర్‌‌‌‌కు ఫోన్ చేసి చెప్పిన తర్వాత తన వద్దకు డాక్టర్లు వచ్చారని ఆయన వెల్లడించారు.

అప్పటివరకూ తాను ఇంట్లో భయం భయంగా గడిపానని చెప్పుకొచ్చారు. తనకు జ్వరం వస్తోందని హాస్పిటల్‌‌కు షిఫ్ట్ చేయండని అడిగితే, ఒక ట్రెండు రోజులు చూసి తగ్గకపోతే షిఫ్ట్ చేస్తామంటూ న్నారని చార్మినార్‌‌‌‌కు చెందిన మరో వ్యక్తి తెలిపారు. ఈ లోపల పరిస్థితి విషమిస్తే బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. ఇలా రకరకాల సమస్యలు, భయంతో హోమ్‌ ఐసోలేషన్‌‌లో ఉన్నవ్యక్తులు, వాళ్లకుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎసింప్టమాటిక్, మైల్డ్ సిప్టమాటిక్ వ్యక్తులను హోమ్ ఐసోలేషన్‌‌లో ఉండనివ్వొచ్చని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఇందుకు కొన్నిరూల్స్ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, మన రాష్ట్రంలో ఆ రూల్స్‌ పాటించకుండానే వందల మందిని హోమ్ ఐసోలేట్ చేస్తున్నారు. ప్రస్తుతం 3వేల మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌‌లోనే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వెంటనే సింప్టమ్స్ లేకుంటే హోమ్‌ ఐసోలేషన్‌‌లో ఉండాలని చెబుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థి తి ఏమిటీ? ఇతర జబ్బులేమైనా ఉన్నాయా? ఇంట్లో ఐసోలేషన్ లో ఉండే సదుపాయం ఉన్నదా లేదా అనే అంశాలను కూడా పట్టించుకోవడం లేదు.

ఐసోలేషన్‌‌లో ఉన్న వ్యక్తులకు స్థానికంగా ఉండే ఆరోగ్యకార్యకర్తలు వచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్తున్నారు. అవి వేసుకున్నదీ లేనిదీ రోజుకు రెండు సార్లు కాల్ చేసి అడుగుతున్నారు. అప్పుడప్పుడు డాక్టర్లు మా ట్లాడుతున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌‌లో ఉన్న వ్యక్తిని చూసుకునేందుకు కుటుంబంలో ఒక సభ్యుడిని నియమించాలి. అతను పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి. వైరస్ సోకకుండా ఆ వ్యక్తికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ‌ట్యాబ్లెట్స్ ‌ఇవ్వాలి. కానీ, చాలా మందికి ఈ ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదు. కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా ప్రొవైడ్ చేయడం లేదు. తొలుత కంటైన్‌‌మెంట్ జోన్లలో వందల ఇండ్లకు సరుకులు పంపించిన అధికారులు, ఇప్పుడు పాజిటివ్ వ్యక్తులకు ఎలాంటి సహాయం చేయడం లేదు. వైరస్ భయంతో తెలిసిన వాళ్లు కూడా సాయం చేసేందుకు వెనకాడుతున్నారు.

చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఉన్నఇంట్లో కరోనా పేషెంట్లను ఐసోలేట్ చేయడం ప్రమాదమని తెలిసినా, అధికారులు అవేమీ పట్టించుకోవడంలేదు. సింప్టమ్స్‌‌ లేకుంటే ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌‌ వరకూ పరిస్థితి ఇలాగే ఉంది.ఊళ్లలో జనాలు తిరగబడుతుండగా, ఇక్కడ అపార్ట్ ‌మెంట్ వాసులు పేషెంట్లను చిన్నచూపుచూస్తున్నారు.

ఇటీవల వైరస్ బారిన పడిన కరోనా హైలెవల్ కమిటీ సభ్యుడికి సైతం ఇలాగే చేదు అనుభవం ఎదురైంది. హోమ్‌‌ ఐసోలేషన్‌‌లోఉందామని వెళ్లిన అతనికి, అపార్ట్ ‌మెంట్ వాసులు అభ్యంతరం చెప్పడంతో తిరిగి నిమ్స్‌ లోఅడ్మిట్ అయ్యాడు. వాస్తవానికి హోమ్ ఐసోలేషన్‌‌లో ఉండాలా? గవర్నమెంట్ ఐసోలేషన్‌‌ సెంటర్‌‌‌‌కు వెళ్లాలా అనేది పేషెంట్లు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కానీ,మన దగ్గర అధికారులే నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతోబాధితులు సమస్యల బారిన పడుతున్నారు.భయం భయంగానేఐసోలేషన్‌‌ కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

Tags :

Advertisement