Advertisement

  • భారీగా పెరిగిన వెండి ధరలు… మిశ్రమంగా ఉన్న బంగారం ధర…

భారీగా పెరిగిన వెండి ధరలు… మిశ్రమంగా ఉన్న బంగారం ధర…

By: chandrasekar Tue, 03 Nov 2020 3:04 PM

భారీగా పెరిగిన వెండి ధరలు… మిశ్రమంగా ఉన్న బంగారం ధర…


బులియన్ మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే వెండి ధరలు మాత్రం భారీ పుంజుకున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు యథాతథంగా కొనసాగగా, ఢిల్లీలో మాత్రం ధర పెరిగింది. మరోవైపు నిన్న పతనమైన వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,610 వద్ద మార్కెట్ అవుతోంది.

ఇటీవల ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా దిగొచ్చిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.730 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,670కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.1,600 మేర పుంజుకుంది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,700కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది.

Tags :
|
|
|
|

Advertisement