Advertisement

రుణగ్రహీతలకు ఎస్.బీఐ గుడ్ న్యూస్..!

By: Anji Tue, 22 Sept 2020 5:31 PM

రుణగ్రహీతలకు ఎస్.బీఐ గుడ్ న్యూస్..!

కరోనాతో ఇప్పుడు అందరి ఆదాయం పడిపోయింది. ఆర్థికంగా అందరిపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా అర్హత కలిగిన రిటైల్ రుణాలను ఒకసారి పునర్వ్యస్థీకరించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్.బీ.ఐ. రిటైల్ కస్టమర్లు తమ రుణ పునర్వ్యస్తీకరణకు అర్హులమా? కాదా అని తెలుసుకునే సదుపాయాన్ని తెలుసుకునేందుకు ఎస్.బీ.ఐ పోర్టల్ లో ఏర్పాటు చేశారు.

ఈమేరకు బ్యాంక్ ఎండీ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. ‘ఏకకాల రుణాల పునర్వ్యస్థీకరణ ద్వారా లబ్ధి పొందేందుకు అర్హతలు ఏమిటో తెలుసుకోవడంలో చేయూతను ఇచ్చేందుకు వెబ్ సైట్ లో ఈఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చారు. ఇక నుంచి బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఖాతాదారులు తమ అర్హతలను ఎలక్ట్రానిక్ మోడ్ లో తెలుసుకోవచ్చు.

రుణ గ్రహీతలు ఒకసారి సంతకాల కోసం బ్యాంకుకు వెళితే సరిపోతుంది. తాత్కాలికంగా ఉద్యోగ ఉపాధి కోల్పోయి రానున్న ఆరు నెలల నుంచి 24 నెలల కాలపరిమితితో తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం ఉన్న వారికి తాము అండగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు. రిటైల్ పునర్వ్యస్థీకరణ కింద హౌసింగ్ ఇతర అనుబంధ రుణాలు విద్యారుణాలు వెహికల్ లోన్స్ పర్సనల్ లోన్స్ వంటివి పునర్వ్యస్థీకరించుకోవచ్చని ఎస్.బీ.ఐ ఎండీ వివరించారు.

Tags :

Advertisement