Advertisement

బడ్జెట్ ధరలో 'ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 5' ఫోన్

By: chandrasekar Fri, 14 Aug 2020 3:50 PM

బడ్జెట్ ధరలో  'ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 5' ఫోన్


ఇంటర్నెట్ ఆధారంగా అన్ని పనులు జరగడం వల్ల స్మార్ట్ ఫోన్ వాడుక ప్రజల మధ్య అధికంగా వుంది. అందువల్ల రోజుకో స్మార్ట్ ఫోన్ ను చాలా కంపెనీలు విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధరలో ఇన్ ఫీనిక్స్ తన కొత్త ఫోన్ స్మార్ట్ 5ను లాంచ్ చేసింది. ఇందులో పెద్ద డిస్ ప్లేను అందించడం విశేషం. ముందువైపు చిన్న నాచ్ లో సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ నాలుగు రోజుల పాటు వస్తుందని కంపెనీ తెలుపుతోంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందించారు. వివరాలు పరిశీలించినట్లైతే.

'ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 5' ఫోన్ స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు:

* ఈ ఫోన్లో 6.6 అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లేను అందించారు.
* మెమరీ 3 జీబీ ర్యామ్ ఇందులో ఉంది.
* ఈ ఫోన్ లో 1.8 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేయనుంది. ఫోన్ నైజీరియన్ వేరియంట్ లో 1.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ ఉంది.
* ఫోను వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతోపాటు మరో రెండు క్యూవీజీఏ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. ఇక ముందువైపు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఇందులో అందించారు.
* ఈ ఫోన్ లో స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీగా ఉంది.
* వైఫై, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
* బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ తో లాంచ్ అయింది. అయితే ఈ వెబ్ సైట్ లో దీని ధరను తెలపలేదు. దీని నైజీరియన్ వేరియంట్లో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉంది. దీని ధర 39,500 నైజీరియన్ నైరాలుగా (సుమారు రూ.7,800) నిర్ణయించారు. ఐస్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, క్వెట్జెల్ సియాన్ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.

Tags :
|
|

Advertisement