Advertisement

  • వీడియో గేమ్ ఆడితే నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ 83 ఏళ్ళ పాటు ఉచితం..

వీడియో గేమ్ ఆడితే నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ 83 ఏళ్ళ పాటు ఉచితం..

By: Sankar Sun, 19 July 2020 4:31 PM

వీడియో గేమ్ ఆడితే నెట్ ఫ్లిక్స్ మెంబర్ షిప్ 83 ఏళ్ళ పాటు ఉచితం..



ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కు బాగా డిమాండ్ ఏర్పడింది ..బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడం వెళ్లిన కూడా థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో ప్రజలు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే కొత్త సినిమా దగారి నుంచి పథ సినిమాల వరకు అన్నిటిని చూసేస్తున్నారు ...దీనితో నెట్ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ , హాట్స్టార్ వంటి వాటికి బాగా డిమాండ్ ఏర్పడింది ..అయితే ఈ యాప్స్ లో చూడాలంటే మెంబర్షిప్ కొనుక్కోవాలి ..

కానీ నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వినియోగదారులను ఆకర్శించే ప్రణాళికను నెట్‌ఫ్లిక్స్‌ రచించింది. అయితే వినియోగదారులు ఉచిత సేవలను పొందాలంటే ‘ద ఓల్డ్‌ గార్డ్‌’ అనే వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్‌ తెచ్చుకోవాలని షరతు పెట్టింది. వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్‌ సాధించిన వినియోగదారులకు 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సేవలను పొందవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ఈ వీడియో గేమ్‌ను జులై 17 8గంటల నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఉచిత సేవల ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.

అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2020) ఎన్నో ప్రతికూలతలున్న రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే కోవిడ్‌-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డౌన్‌, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది.‌ మరోవైపు కరోనా నేపథ్యంలో కుటుంబ సమేతంగా సినిమాలు వీక్షించే వారికి నెట్‌ఫ్లిక్స్‌ మంచి క్వాలిటీ అందిస్తు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న విషయం తెలిసిందే.

Tags :
|
|
|

Advertisement