Advertisement

  • ‘వరల్డ్‌‌ టాప్‌‌–10 రిచెస్ట్‌‌ పర్సన్స్‌‌’ లిస్టులో చోటు దక్కించుకొన్న ముకేశ్ అంబానీ

‘వరల్డ్‌‌ టాప్‌‌–10 రిచెస్ట్‌‌ పర్సన్స్‌‌’ లిస్టులో చోటు దక్కించుకొన్న ముకేశ్ అంబానీ

By: chandrasekar Mon, 22 June 2020 5:07 PM

‘వరల్డ్‌‌ టాప్‌‌–10 రిచెస్ట్‌‌ పర్సన్స్‌‌’ లిస్టులో చోటు దక్కించుకొన్న ముకేశ్ అంబానీ


ముకేశ్ అంబానీ ‘వరల్డ్‌‌ టాప్‌‌–10 రిచెస్ట్‌‌ పర్సన్స్‌‌’ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఆసియా నుంచి ఈ లిస్ట్‌‌లో చోటు దక్కించుకున్న ఏకైక సంపన్నుడు ముకేశ్ అంబానీ మాత్రమేనని బ్లూమ్‌‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌‌ వెల్లడించింది. ఓరాకిల్ కార్ప్ చీఫ్‌‌ ల్యారీ ఎల్లిసన్, ఫ్రాన్స్‌‌కు చెందిన ఫ్రాన్స్‌‌కోయస్ బెటన్‌‌కోర్ట్ మేయర్‌‌ను ముకేశ్ ఓవర్‌‌‌‌టేక్ చేసి, తొమ్మిదో స్థానాన్ని సంపాదించుకున్నారు.

రిలయన్స్‌‌ అప్పులు లేని సంస్థగా మారినట్టు శుక్రవారమే ముకేశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌‌ఫామ్స్ లిమిటెడ్‌‌లోకి వచ్చిన ఇన్వెస్ట్‌‌మెంట్లతో రిలయన్స్ డెట్‌‌ఫ్రీ కంపెనీగా మారిపోయింది. ఇన్వెస్ట్‌‌మెంట్ల వరదతో మార్చి నుంచి రిలయన్స్ షేర్లు రెండింతలకు పైగా పెరిగాయి. అయితే కరోనా వైరస్ ప్రభావంతో బిలియనీర్స్ సంపద భారీగా దెబ్బతినగా ముకేశ్ అంబానీ మాత్రం ఇదేకాలంలో 64.5 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకోగలిగారు.

‘కరోనా వైరస్ ప్రభావంతో ఇండియా ఎకానమీ బాగా పడిపోయింది. ఈ సమయంలో ముకేశ్ అంబానీ కంపెనీలు ముఖ్యంగా టెలికాం కంపెనీ జియో ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారింది. ఆయన సంపద కూడా బాగా పెరుగుతూ వచ్చింది’ అని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్‌‌లో ప్రొఫెసర్‌‌ జయతి ఘోష్‌‌ తెలిపారు. అయితే ముకేశ్ సంపదపై చర్చించేందుకు రిలయన్స్ మీడియా ప్రతినిధి అంగీకరించలేదు.

Tags :
|
|
|

Advertisement