Advertisement

  • ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ అనే పదాన్ని తొలిగిస్తున్నట్లు ప్రకటించిన హిందుస్థాన్ యూనిలివర్

ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ అనే పదాన్ని తొలిగిస్తున్నట్లు ప్రకటించిన హిందుస్థాన్ యూనిలివర్

By: Sankar Thu, 25 June 2020 6:21 PM

ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ అనే పదాన్ని తొలిగిస్తున్నట్లు ప్రకటించిన హిందుస్థాన్ యూనిలివర్



హిందుస్థాన్ యూనిలివర్ ఉత్పత్తుల్లో ఒకటైన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ నేమ్ విషయంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగిస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ సంస్థ ప్రకటనల్లో నల్లగా ఉండటాన్ని ప్రతికూలతగా చూపిస్తూ.. నల్లగా ఉన్నవారు అందవిహీనంగా ఉన్నట్లు చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అమెరికాలో ‘బ్లాక్ లివ్స్ మేటర్’ ఊపందుకున్న ఈ సందర్భంలో ‘ఫెయిర్’ అనే పదాన్ని వినియోగించి తమ ఉత్పత్తులను విక్రయించడం సరికాదని ఈ సంస్థ అభిప్రాయపడింది.

ఫెయిర్’, ‘వైట్’, ‘లైట్’ పదాలు అందానికి ఏకపక్ష నిర్వచనాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని, ఇది సమంజసం కాదని అనిపించే.. తాము ఈ పదాలను తొలగించాలని నిర్ణయించినట్లు యూనిలివర్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ డివిజన్ ప్రెసిడెంట్ సన్నీ జైన్ తెలిపారు. అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ అనే వ్యక్తి.. మే 25న డెరెక్ చావిన్ అనే పోలీసు అధికారి కారణంగా ఊపిరి ఆడక మరణించాడు.

నల్లజాతీయుల వివక్ష విషయంలో నిరసనజ్వాలలు మిన్నంటడంతో ఇటీవల బ్లాక్ లివ్స్ మేటర్ ఉద్యమానికి మద్దతుగా జాన్సన్ అండ్ జాన్సన్ కూడా భారత్‌లో విక్రయించే రెండు ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాసియాలో ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌లో ఫెయిర్ అండ్ లవ్లీదే ఇప్పటివరకూ పైచేయి. ఫెయిర్ అనే పదాన్ని తొలగించిన యూనిలివర్ త్వరలో కొత్త పేరును ప్రకటిస్తామని తెలిపింది.

Tags :
|

Advertisement