Advertisement

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర ..వెండి ధరలో మాత్రం తగ్గుదల

స్వల్పంగా పెరిగిన బంగారం ధర ..వెండి ధరలో మాత్రం తగ్గుదల

By: Sankar Sat, 06 June 2020 11:10 AM

స్వల్పంగా పెరిగిన బంగారం ధర ..వెండి ధరలో మాత్రం తగ్గుదల

గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్ళీ స్వల్పంగా పెరిగింది..అయితే గత కొద్దీ రోజులుగా పెరుగుతున్న వెండి ధర మాత్రం తగ్గింది..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గినప్పటికీ భారత్ లో మాత్రం పెరగడం గమనార్హం..హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పైకి కదిలింది. దీంతో ధర రూ.44,750కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగింది. దీంతో ధర రూ.48,830కు ఎగసింది.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర స్వల్పంగా రూ.20 క్షీణించింది. దీంతో ధర రూ.48,480కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

gold,silver,cost,hyderabad,delhi , పెరిగిన,  బంగారం , ధర,  వెండి, నాణేపు,  24 క్యారెట్ల

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 2.26 శాతం దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్‌కు 1688 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 2.74 శాతం తగ్గుదలతో 17.56 డాలర్లకు క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. దీంతో ధర రూ.45,300 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. రూ.46,500 వద్దనే ఉంది. కానీ కేజీ వెండి ధర తగ్గింది. రూ.20 తగ్గుదలతో రూ.48,480కు క్షీణించింది.

Tags :
|
|
|

Advertisement