Advertisement

  • భారీగా దిగొచ్చిన బంగారం ధరలు ..బంగారం కొనేవారికి ఇదే సువర్ణావకాశం

భారీగా దిగొచ్చిన బంగారం ధరలు ..బంగారం కొనేవారికి ఇదే సువర్ణావకాశం

By: Sankar Sun, 16 Aug 2020 6:36 PM

భారీగా దిగొచ్చిన బంగారం ధరలు ..బంగారం కొనేవారికి ఇదే సువర్ణావకాశం


బంగారం ధర పడిపోయింది. భారీగా దిగొచ్చింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర వారం రోజుల్లో భారీగానే తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ ఇందుకు కారణం. పసిడి ధర బాటలోనే వెండి కూడా నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర వారంలో భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2930 పడిపోయింది. రూ.58,690 స్థాయి నుంచి రూ.55,760కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాములకు రూ.2,690 దిగొచ్చింది. రూ.51,110కు పడిపోయింది. కిలో వెండి ఏకంగా 2377 రూపాయలు తగ్గి 68,700 రూపాయలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1952 డాలర్లకు దిగివచ్చింది. ఈ వారం బంగారం ధరలు 4 శాతం మేర తగ్గాయి.

కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను నమోదు చేశామని రష్యా ప్రకటించిన అనంతరం ఇన్వెస్టర్లు బంగారంలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక మరికొద్ది రోజులు బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగి ఆపై నిలకడగా పెరుగుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌, ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌లతో ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటికే 30 శాతం పెరగడం గమనార్

Tags :
|
|
|
|
|

Advertisement