Advertisement

హీరో ను అధిగమించిన బజాజ్

By: Sankar Thu, 04 June 2020 3:19 PM

హీరో ను అధిగమించిన బజాజ్

కోవిడ్ 19 వల్ల దేశీ టూవీలర్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. అతిపెద్ద టూవీలర్ కంపెనీగా కొనసాగుతూ వచ్చిన హీరో మోటొకార్ప్‌కు భారీ ఝలక్ తగిలింది. బజాజ్ ఆటో ఇప్పుడు హీరో కంపెనీకి షాకిచ్చింది. ఏకంగా హీరో కంపెనీనే వెనక్కు నెట్టేసింది. దేశీ అతిపెద్ద టూవీలర్ తయారీ కంపెనీగా ఆవిర్భవించింది.

బజాజ్ ఆటో మే నెలలో హీరో మోటొకార్ప్ కంపెనీని అధిగమించింది. బజాజ్ కంపెనీ మే నెలలో 1,12,798 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అదేసమయంలో హీరో కంపెనీ టూవీలర్ల అమ్మకాలు 1,12,682 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా బజాజ్ ఆటో.. హీరో మోటొకార్ప్ కన్నా మంచి పనితీరు కనబర్చింది. అయితే అప్పుడు ఎగుమతులు మాత్రమే ఉన్నాయి. దేశీ మార్కెట్‌లో అమ్మకాలు లేవు.

bajaj,hero,pulsar,honda,tvs,apachi , దేశీ మార్కెట్‌లో ,  బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, అతిపెద్ద టూవీలర్ ,  మే నెల


ఇకపోతే కేవలం బజాజ్ ఆటో మాత్రమే కాకుండా లాక్ డౌన్ మరో టూవీలర్ కంపెనీకి కూడా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ కంపెనీ మరేదో కాదు టీవీఎస్ మోటార్. ఈ కంపెనీ మే నెలలో హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ కన్నా ఎక్కువ టూవీలర్లను అమ్మగలిగింది. ఏప్రిల్ నెలలో కూడా టీవీఎస్ అమ్మకాలు హోండా కన్నా ఎక్కువగానే ఉన్నాయి. జూపీటర్, అపాచీ వంటి టూవీలర్లను తయారు చేసే టీవీఎస్ అమ్మకాలు గత నెలలో 56,218 యూనిట్లుగా ఉన్నాయి.

Tags :
|
|
|
|
|

Advertisement