Advertisement

  • జియోలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆథార్టీ(ఏడీఐఏ) సంస్థ 5683 కోట్ల పెట్టుబడి

జియోలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆథార్టీ(ఏడీఐఏ) సంస్థ 5683 కోట్ల పెట్టుబడి

By: chandrasekar Tue, 09 June 2020 5:40 PM

జియోలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆథార్టీ(ఏడీఐఏ) సంస్థ 5683 కోట్ల పెట్టుబడి


జియోలో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టింది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆథార్టీ(ఏడీఐఏ) సంస్థ రూ.5,683.50 కోట్లతో 1.16 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటి వరకు జియోలో వాటాలను విక్రయించడం ద్వారా రూ.97,885.65 కోట్ల నిధులు సమకూరినట్లు అయింది. జియో నికర విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ.5.16 లక్షల కోట్ల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది.

జియోలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబాదల, ఏడీఐఏలు పెట్టుబడులు పెట్టాయి. గడిచిన ఏడు వారాల్లో ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నది సంస్థ. ముబాదల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే మరో అబుదాబీ సంస్థ ఇన్వెస్ట్‌ చేయడం విశేషం. జియోకు 38.80 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారు.

ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఉచితంగా ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. ఈ ఉచిత ఆఫర్‌ పొందాలంటే రూ.401 నెలవారి రీచార్జి ప్లాన్‌, రూ.2,599 వార్షిక ప్లాన్‌తోపాటు రూ.612 వోచర్‌ ప్లాన్లోనూ లభించనున్నాయి. రూ.401 నెలప్యాక్‌పై 90 జీబీ డాటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, జియో యాప్స్‌కు పొందవచ్చును.

Tags :

Advertisement