Advertisement

పుదీనా ప్యాక్ తో అందాన్ని పెంచుకునే చిట్కాలు ..

By: Sankar Sun, 19 July 2020 3:47 PM

పుదీనా ప్యాక్ తో అందాన్ని పెంచుకునే చిట్కాలు ..



నాన్ వెజ్ లాంటి కూరల్లో ఎన్ని దినుసులు వేసిన కూడా చివర్లో పుదీనా వేయడం వలన వచ్చే టేస్ట్ వేరు ..అయితే పుదినాను కూరల్లో మాత్రమే కాకుండ అందాన్ని పెంచుకునే సాధనంగా కూడా వాడుకోవచ్చు ..అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ..

1. పుదీనాని రాయడం వల్ల యంగ్‌గా కూడా కనిపిస్తారని చెబుతున్నారు నిపుణులు. దీనిని ఈ ఆకుల్లోని చర్మ రక్షణకు సాయపడే ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఈ కారణంగా వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.

2. పుదీనా ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా ఇస్తుంది.. పుదీనా ప్యాక్ వేయడం వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఖరీదైన క్రీమ్స్ రాసినా కూడా రాని మెరుపు మీ సొంతం అవుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా వేసుకుంటుండండి.. పుదీనా ప్యాక్ వేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి.. హ్యాపీగా ఈ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చు.

3. పుదీనా ప్యాక్ మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలనే కాదు.. దోమకాటు వల్ల ఏర్పడిన మచ్చలను కూడా పోగోడుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ చిట్కాను ఉపయోగించండి. ఇందుకు కారణం పుదీనాలోని ప్రత్యేక గుణాలు ఉండడమే.

4. పుదీనా రసంలో కాసింత శనగపిండిని కలపండి. దీన్ని ప్యాక్‌లా తయారు చేసుకోండి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి వేసుకోండి.. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా చేయడం వల్ల జిడ్డు చర్మం వారికి సమస్య తగ్గుతుంది..

5. పుదీనా పూత కంటి కింద నల్లటి వలయాలను కూడా దూరం చేస్తాయి. రెగ్యులర్‌గా రాయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్ టీ వేసి మిశ్రమంలా చేసి ముఖం, మెడ, చేతులకు రాయడం వల్ల కాలుష్యం వల్ల ఏర్పడిన పేరుకున్న మురికి మొత్తం పోతుంది. చర్మం కూడా మృదువుగా, తాజాగా మారుతుంది.

Tags :
|
|
|

Advertisement