Advertisement

శివ పార్వతుల వివాహం జరిగిన పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా ..!

By: Sankar Sun, 16 Aug 2020 5:15 PM

శివ పార్వతుల వివాహం జరిగిన పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా ..!


కొన్ని జంటలు మాత్రం తమ వివాహం ఆధ్యాత్మిక వాతావరణంలో, గొప్ప ప్రాశస్త్యం గల ప్రదేశాల్లో జరగాలని కోరుకుంటారు. అలాంటి జంటలకు సరైన ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న త్రియుగినారాయణ్ గ్రామం.ఈ గ్రామంలో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. ఇదే ఆలయంలో కొన్ని యుగాల క్రితం మహా శివుడు, పార్వతి దేవి వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు. త్రియుగినారాయణ్ పేరులో "త్రి అంటే మూడు, యుగి అంటే శకము, నారాయణ్ అంటే మహా విష్ణువు మరో నామం" అని అర్ధం.

పురాణాలకు సాక్ష్యంగా నిలిచే ఎన్నో చిత్రాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఉదాహరణకు... ఈ ఆలయంలో 24 గంటలు ఒక ధుని వెలుగుతూ కనిపిస్తుంది. ఇది శివ పార్వతుల వివాహం సమయంలో వెలిగించినదిగా చెబుతారు. ఇక్కడ నాలుగు నీటి కొలనులు కూడా కనిపిస్తాయి.

వీటిలో రుద్ర కుండ్ ను స్నానాల కొరకు, విష్ణు కుండ్ ను ప్రక్షాళన కొరకు, బ్రహ్మ కుండ్ ను తాగేందుకు, సరస్వతి కుండ్ ను తర్పణాల కోసం వినియోగిస్తారు. త్రియుగినారాయణ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కేదార్ నాథ్ పర్వతారోహణకు బేస్ క్యాంప్ అయిన గౌరీ కుండ్ ఆలయంలో కూడా నమస్కారం చేస్తారు.

triyughi narayan,lord shiva,married,parvathi,vishnuvu ,శివ పార్వతుల,  వివాహం,  జరిగిన,  పుణ్యక్షేత్రం,  త్రియుగినారాయణ్


స్థానిక సిద్ధాంతం ప్రకారం... ఇక్కడ శివ పార్వతుల వివాహంలో బ్రహ్మ అర్చక సేవలను చేయగా, విష్ణు మూర్తి వధువు సోదరుడిగా చేయాల్సిన అన్ని ఆచారాలను నిర్వహించినట్లు చెబుతారు. ఈ వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆలయంలో బ్రహ్మ శిల అని పిలువబడే రాయి ఉంటుంది. ఇక్కడ పవిత్రమైన అగ్ని నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లి ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకుంటే నూతన జంట సంతోషంగా ఉంటారని నమ్ముతారు.

ఈ ఆలయం సోన్ ప్రయాగ్ నుండి మోటారబుల్ రోడ్ ద్వారా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రత్యామ్నాయంగా కొందరు పర్యాటకులు గుట్టుర్ - కేదార్ నాథ్ వంతెన మార్గంలో సోన్ ప్రయాగ్ ద్వారా 5 కిలోమీటర్ల చిన్న ట్రెక్ చేస్తూ దట్టమైన అడవి గుండా చేరుకుంటారు. కేదార్ నాథ్ ఆలయం నుంచి త్రియుగినారాయణ ఆలయానికి ట్రెక్కింగ్ ద్వారా 25 కిలోమీటర్ల దూరం. అలాగే మరో ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం ముస్సోరీ వయా తెహ్రీ, మాలా (రోడ్ పాయింట్), బెలక్, అదేవిధంగా బుడకేదార్-ఘుట్టు-పన్వాలి కాంత, త్రియుగి నారాయణ్, కేదార్ నాథ్ గుండా వెళుతుంది. ఈ ట్రెక్ పూర్తి చేయడానికి 17 రోజుల సమయం పడుతుంది.

రైలు ప్రయాణికులు హరిద్వార్ స్టేషన్ లో దిగాల్సి ఉంటుంది. హరిద్వార్ నుంచి త్రియుగి నారాయణ్ ఆలయానికి 275 కిలోమీటర్ల దూరం. అలాగే వాయు మార్గంలో రావాలనుకునే వారికి సమీప విమానాశ్రయం డెహ్రాడూన్. ఇక్కడి నుంచి ఆలయానికి 244 కిలోమీటర్ల దూరం. ట్యాక్సీ ద్వారా త్రియుగినారాయణ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి రైల్, రోడ్ లేదా వాయు మార్గాల ద్వారా ప్రయాణం ప్రారంభించడం మంచి ఎంపిక.

Tags :

Advertisement