Advertisement

కుద్రేముఖ్ కొండలు జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ‌

By: chandrasekar Wed, 22 July 2020 5:07 PM

కుద్రేముఖ్ కొండలు జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ‌


కుద్రేముఖ్‌ చిక్కమంగళూరుకి 95 కిలోమీటర్ల నైరుతి దిశలో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరులో ఉన్న కుద్రేముఖ్‌ కొండలు జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులను కనువిందు చేస్తాయి. కన్నడ భాషలో కుద్రేముఖ్‌ అంటే గుర్రపు ముఖం అని అర్దం. ఈ పర్వశ్రేణులు గుర్రపు ముఖం ఆకారంలో ఉండటం వల్ల కుద్రముఖ్‌ అని పిలుస్తారు.

ఈ కుద్రేముఖ్‌ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్‌ జాతీయ ఉద్యానవనం ఉంటుంది. అరేబియా సముద్రంవైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎతైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1894.3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముల్‌లో అపారమైన ఇనుప గనులున్నాయి.

kudremukh,hills,waterfalls,scenic,locations ,కుద్రేముఖ్,  కొండలు , జలపాతాలు, ప్రకృతి , రమణీయ దృశ్యాలు ‌


పచ్చటి ప్రదేశాలతో కనువిందు చేస్తాయి

శూల గడ్డి భూములలో ట్రెక్కింగ్‌ చేయటం ఎంతో ఆనందంగా ఉంటుంది. గడ్డి ప్రదేశాలపై సూర్యకిరణాలు పడి తళతళలాడుతాయి. అడవికి ఇరువైపుల ఉన్న రోడ్డు మార్గంలో నడుస్తుంటే పచ్చటి అరణ్యం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లుగా ఉంటుంది.

కుద్రేముఖ్‌ ప్రదేశంలో అంబా తీర్థ నది స్వచ్ఛంగా పారుతుంది. ఇక్కడి పరిసరాలు వర్షాకాలంలో అత్యంత సుందరంగా కనపడుతాయి. ఇక్కడి పర్వత శిఖరాలు కూడా పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. ఇక్కడ కొండలపై సైకిల్‌ మీద వెళ్లటం ఒక మధురానుభూతినిస్తుంది.

kudremukh,hills,waterfalls,scenic,locations ,కుద్రేముఖ్,  కొండలు , జలపాతాలు, ప్రకృతి , రమణీయ దృశ్యాలు ‌


పర్వతాలు, వృక్షాల మధ్యలో నిర్మించిన రోడ్డు మార్గంలో నడుస్తుంటే కలిగే ఆనందం అద్భుతం. వర్షాకాలంలో ఇక్కడ కుడురేముఖ్‌లోని లఖ్యా జలాశయం నీటితో కళకళలాడుతుంది. ఆ సమయంలో పర్యాటకులు చూసేందుకు వస్తుంటారు. కుద్రేముఖ్‌లో ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు పర్యాటకులను కనువిందు కలిగిస్తాయి.

Tags :
|
|

Advertisement