- హోమ్›
- టూర్స్ అండ్ ట్రావెల్స్›
- శ్రీ బృహదీశ్వర ఆలయం విశేషాలు
శ్రీ బృహదీశ్వర ఆలయం విశేషాలు
By: chandrasekar Sat, 25 July 2020 4:42 PM
తమిళనాడులోని పురాతన
దేవాలయాల్లో శ్రీ బృహదీశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు
ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్ట మొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి
సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంద్దాం. తమిళనాడులోని పురాతన నగరాలలో
తంజావూరు నగరం ఇది ఒకటి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును
తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు.
శ్రీబృహదీశ్వర ఆలయం
తంజావూరులో 74
దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం
తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో
ప్రముఖమైనది. చోళ శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం 1,30,000 టన్నుల గ్రానైట్ తో
నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్ట మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ
భారత దేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66
మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర
విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ
నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భారతనాట్యం భంగిమలో 108
శిల్పాలు, ప్రాంగణంలో
250
లింగాలు ఉన్నాయి. తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృహదీశ్వరాలయం
ఆలయాన్ని తప్పక సందర్శించాలి.
తంజావూర్ ప్యాలెస్
బృహదేశ్వర ఆలయం కాకుండా
తంజావూర్ లో తప్పక చూడాల్సిన ప్రదేశం తంజావూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ శ్రీ
బృహదేశ్వర ఆలయానికి ఆనుకుని ఉంది. దీనిని మరాఠాలు నిర్మింక్చారు. ప్యాలెస్ లోని
అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్యాలెస్ సరస్వతి మహల్
లైబ్రరీ, ఆర్ట్
గ్యాలరీ, సంగీత
మహల్ లకు నిలయం. ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన
వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు. ప్యాలెస్ గార్డెన్ లో స్క్వార్ట్జ్ చర్చి కూడా
ఉంది. ఇవి కాకుండా తంజావూరులో కుంబకోణం, దరాసురం, గంగైకొండ చోళపురం, తిరువైయారు, తిరుభువనం వంటివి చూడవచ్చు.
ఇది చోళుల బురుజు
ఈ నగరం ఒకప్పుడు చోళుల
యొక్క బురుజుగా ఉండేది. అంతేకాదు ఇది చోళులు, ముతరాయలు, మరాఠాలకు రాజధానిగా సేవలందించింది. అప్పటి నుండి
తంజావూర్ దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో
ఒకటిగా మారింది. క్రీస్తు శకం 1010లో రాజరాజు చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి
తంజావూర్ ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ
ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యాటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప
ప్రాముఖ్యత ఉంది.
తంజావూర్ ఎలా చేరుకోవాలి?
తంజావూర్ తిరుపతికి 412
కిలోమీటర్లు, బెంగళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 8
గంటల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం: బెంగళూరు, చెన్నై, మధురై, భువనేశ్వర్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి
వంటి అనేక నగరాల నుండి తంజావూర్ కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేటు
బస్సు సర్వీసులు నిరంతరం ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం: తంజావూర్ కు
సమీప రైల్వే స్టేషన్ గా కూడా తిరుచ్చిరాపల్లి ఉంది. ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రముఖ
నగరాలైన కోయంబత్తూర్, రామేశ్వరం, చెన్నై, కన్యాకుమారి, సలేం, మధురైలకు రైలు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది.
వాయు మార్గం: తంజావూర్ కు
సమీప విమానాశ్రయం తిరుచ్చిరాపల్లి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్. ట్యాక్సీలు మరియు
కొన్ని బస్సులు ఈ రెండు నగరాల మధ్య తరచుగా నడుస్తుంటాయి.